ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం
శ్లో" శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్ ||
సనాతన ధర్మం అర్ధం:-
వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై, సర్వారిష్టాలూ తొలగిపోతాయనీ.... నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.
ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంధంలో ఉంది:-
శ్లో" అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల మృతైర్యుతమ్ భక్షితం పూర్వయామేస్యా తద్వర్షం సౌఖ్యదాయకమ్ ||,
అర్థం:- ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే... ఆ సంవత్సరం అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి