21, మార్చి 2023, మంగళవారం

ఉగాది

 [20/03, 6:53 am] K Sudhakar Adv Br: 🙏🕉️🌹🌷🙏🌷🌹🕉️🙏


           🕉️ *శ్రీ శివ కవచం*🔯


🌴ప్రతీరోజూ ఈ స్తోత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది🌴


_*పూర్వే పశుపతిః పాతు, దక్షిణే పాతు శంకరః| పశ్చిమే పాతు విశ్వేశో,  నీలకంఠ స్థధొత్తరే | ఈశాన్యాం పాతు మే శర్వో, పార్వతీ హ్యగ్నేయం పార్వతీ పతిః | నైరుత్యాం  పాతు మే రుద్రోణుడు, వాయవ్యాం నీలలొహితః| ఊర్ధ్వే త్రిలొచనః పాతు, అధరాయం మహేశ్వరః| ఏతోభ్యో దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః| నమశ్శివాయ సాంబాయా శాంతాయ పరమాత్మనే| మృత్యుంజయాయ రుద్రాయ మహదేవాయతే నమః||*_


_*అర్థము:-* తూర్పున పశుపతి, దక్షిణాన శంకరుడు, పడమరన విశ్వేశ్వరుడు, ఉత్తరాన నీలకంఠుడు, ఈశాన్యాన శర్వుడు, ఆగ్నేయంలో పార్వతీపతి, నైఋతిలో రుద్రుడు, వాయవ్యంలో నీలలోహితుడు, పైన త్రిలోచనుడు, క్రింద మహేశ్వరుడు…_

_ఇలా వివిధ నామాలతో పదిదిక్కులలో అన్ని విధములుగా  శివుడు నన్ను కాపాడుగాక!! అంబాసమేతుడు, శాంతస్వరూపుడు, పరమాత్మ, మృత్యుంజయుడు, రుద్రుడు, మహాదేవుడు శివుడు. ఆ స్వామికి నమస్సులు_

_ఈ స్థొత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది._🍒


            🪷🪷 _*సేకరణ*_ 🪷🪷


*ఉగాది విశిష్టత..*


("శోభకృత్"  నామ‌ సంవత్సర ఉగాది)


చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత రుతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.


శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ ఉంది. 'ఉగాది', 'యుగాది' అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. 'ఉగ' అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా 'ద్వయం; లేదా 'జంట' అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. "యుగాది" శబ్దానికి ప్రతిరూపంగా "ఉగాది" రూపొందింది.


తెలుుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు 'గుడిపడ్వా'గా, తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు.


*ఉగాది పచ్చడి ప్రాముఖ్యత..*


ఉగాది రోజు ముఖ్యమైన వంటకం "ఉగాది పచ్చడి". షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి లోని ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.


బెల్లం- తీపి:

ఆనందానికి ప్రతీక!


ఉప్పు:

జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం!


వేప పువ్వు- చేదు:

బాధకలిగించే అనుభవాలు!


చింతపండు- పులుపు:

నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు!


పచ్చి మామిడి ముక్కలు- వగరు:

కొత్త సవాళ్లు!


కారం:

సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు!



*ఉగాది రోజున.....* 


తైలాభ్యంగనం......................

నూతన సంవత్సరాది స్తోత్రం....

నింబ కుసుమ భక్షణం.............

ధ్వజారోహణం......................

పంచాంగ శ్రవణం...................

 

మున్నగు "పంచకృత్య నిర్వహణ" గావించవలెనని వ్రతగంధ నిర్ధేశితం.


సంవత్సరాది నాడు ఉగాది పచ్చడి ఎలా తయారుచేయాలో కూడా మనకు శాస్త్రమే చెప్పింది. 


యద్వర్షాధౌ నింబసుమం 

శర్కరామ్లఘృతైర్యుతం 

పశ్యతం పూర్వయామేశ్యా 

తద్వర్షం సౌఖ్యదాయకం!!

 

అంటుంది శాస్త్రం. నింబసుమం అంటే వేపపూత. ఉగాదిపచ్చడిలో ఇది

ప్రధానంగా ఉండాలి. వేపచెట్టు పరదేవతా స్వరూపం. వసంత ఋతువులో మాత్రమే పూచే వేపపువ్వులో విశేషమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఆ వేపపువ్వును మొదటిగా నీటిలో కలపాలి. బెల్లం మంగళద్రవ్యం. దానికి నిలవ దోషంలేదు. వేపపువ్వు వేసిన నీటిలో కొత్త బెల్లం వేస్తారు. ఆ తరువాత చింతపండును కూడా వేసి చిక్కని పులుసు పదార్ధంగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అందులో కొంత

ఆవునెయ్యి కలపాలి. భగవంతుని పేరిట ఏ వృక్షజాతి లేదు. ఆ అదృష్టం ఒక్క మామిడి చెట్టుకే దక్కింది. ఈ వృక్షాన్ని రసాల వృక్షం అంటారు. భగవంతుడిని రసోవై సః అంటారు. అలాంటి పరమపవిత్రమైన మామిడి ముక్కలను కూడా ఉగాదిపచ్చడిలో కలుపుకోవడం మన‌ సంప్రదాయం. వీటన్నింటి మిశ్రమముతో తయారైన షడ్రుచుల ఉగాది పచ్చడిని మొదట ఈశ్వరుడికి నివేదించాలి.


శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ 

సర్వారిష్ఠ వినాశాయ 

నింబకం దళ భక్షణమ్!!


నూతన సంవత్సరాది స్తోత్రం చదువుకుని తొలి యామకాలం దాటకుండానే ప్రసాదం స్వీకరించాలి. ఈ నైవేద్యాన్ని స్వీకరించిన వారికి ఈ సంవత్సరమంతా సౌఖ్యదాయకముగా భాసిల్లుతుంది. తరువాత పెద్దలను గురువులను దర్శించాలి. దైవదర్శనం చేయాలి. గోపూజ, వృషభ పూజ చేయాలి. మామిడిపళ్ళు, చల్లటి మంచినీరు, కొత్త వస్త్రాలు, విసనకర్రలు, మజ్జిగ వంటివి ఇతరులకు దానం చేసుకుంటే ఎంతో మంచిది!!

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు.

 *సమరసత సేవా ఫౌండేషన్* 🕉️

               🚩  *ఆంధ్ర ప్రదేశ్*  🚩


🙏 *శ్రీశోభకృత్ ఉగాది  నూతన సంవత్సర శుభాకాంక్షలు*   🙏


మామిడికాయ ,బెల్లం ,చింతపండు

మిరపకాయ ,వేపపూవు ,ఉప్పు 


షడ్రుచులు(ఆరు)తో కూడిన పచ్చడిని తయారుచేసి భగవంతుని కి  నివేదించిన తరువాత అందరూ ప్రసాదంగా పంచుకొని సేవించాలి.


*ఉగాది పచ్చడి తినేముందు ఈ శ్లోకం చెప్పుకోవాలి*


*శతాయు:వజ్రదేహాయ సర్వసంపత్కారాయచ సర్వారిష్టవినాశాయ నింబకందళభక్షణం*


*శతాయు*- 100 సం ఆయువు

 *వజ్రదేహాయ* వజ్రం లాంటి శరీరం, అనగా సంపూర్ణ ఆరోగ్యం

*సర్వ సంపత్* - సకల సంపదలు 

*కరాయచ* - ఒసగునది.            

*సర్వారిష్ట* - సకల అరిష్టములు, అన్ని ఇబ్బందులు

*వినాశాయ* - నశింప జేయునది 

*నింబకం* ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి 

*దళ బక్షణం* - బక్షించుట వలన,  తినుట వలన. 


*ఉగాది పచ్చడి ఈ భావంతో తినండి.* 👌

శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో..

                 ~ మీ *జగన్నాథ్* 🪷

కామెంట్‌లు లేవు: