*2057*
*కం*
గిట్టిన వారికి జననము
పుట్టిన వారికి మరణము పుడమినవిధియౌ.
గిట్టక నుండుట కొరకై
పుట్టిన ప్రతి మనిషిజేయు పూజలు సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పుట్టిన వారి కి మరణము, మరణించిన వారి కి పునర్జన్మ ము ఈ భూలోకంలో విధి. కానీ పుట్టిన మనుషుల లందరూ మరణించకుండా ఉండటానికే పూజలు చేస్తూ ఉంటారు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ* *2058*
*కం*
పిలిచిన పలుకని వారల
పిలిచెడివారలు తరగుచు పెనుసంకటమున్
విలవిలలాడుచు నెంతగ
పిలిచిన పలుకందుకొనరు వితతము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! పిలిచినప్పుడు పలుకనివారిని పిలిచేవారు తగ్గడమే గాక పెద్ద కష్టం లో బాధపడుతూ పిలిచి ననూ వారలకై పలికేవారు ఉండరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి