కాశ్మీర్ పై UN లో జరిగిన చిన్న చర్చ...
ఎప్పటి లానే భారత్ పై పడి ఏడ్చిన పాకిస్థాన్ ప్రతినిధి...
ఇక భారత ప్రతినిధి తన వాదన వినిపించడానికి నిలబడ్డారు. ఐతే తన వాదన వినిపించే ముందు భారత మునీశ్వరులైన కశ్యప ముని గురించి ఒక చిన్న విషయం సభకి చెప్పేందుకు అనుమతి కోరారు...
అనుమతి లభించగానే చెప్పటం ప్రారంభించారు...
"ఎవరి పేరుమీదనైతే కాశ్మీర్ పేరు ఏర్పడిందో, ఆ మహర్షి దేశాటన చేస్తూ కాశ్మీర్ ప్రాంతానికి చేరారు...
కాశ్మీర్ ప్రాంత సౌదర్యాలకి ముగ్దులైన వారు, స్నానం ఆచరించడానికి, తన వస్త్రాలని ఒడ్డుపై వదలి, ఆ దగ్గరలో ఉన్న సుందర కొలనులోకి దిగారు...
ఐతే స్నానమాచరించి ఒడ్డుకి చేరిన వారికి, వారు వదలి వెళ్ళిన వస్ర్తాలు కనపడలేదు...వాస్తవానికి ఆ వస్ర్తాలను ఒక పాకిస్థానీయుడు దొంగిలించాడు..."
ఈ మాట చెప్పగానే పాకిస్థాన్ ప్రతినిధి లేచి తన నిరసన తెలియజేస్తూ ఇలా అన్నాడు...
"ఇదంతా అవాస్తవం. అభూత కల్పన. అసలు ఆ సమయానికి పాకిస్థాన్ అనేదే లేదు..."
భారత ప్రతినిధి చిరునవ్వుతో ఇలా అన్నారు...
"ఇదీ విషయం... ఈ పాకిస్తానీయులు కాశ్మీర్ మాది అంటారు..."అసలు పాకీస్తాన్ అనేదే లేదు అని మరచిపోతుంటారు అని అన్నారు.
😜😂😃
వెనువెంటనే సభ యావత్తు చప్పట్లతో నిండిపోయింది..
😂😝😜👏👏👏
ఎవరు ఎవరిది లాక్కుపోయారు...? ఎవరు దేనిని తమదని వాదిస్తున్నారు...? దేని గురించి మన సైన్యం అహర్నిశలు శ్రమ పడవలసి వస్తోంది ?
అటువంటి రావణకాష్టాన్ని ఓట్ల దృష్టితో చూడకుండా, ధైర్యంగా ముందుకెళ్ళి ఒక logical end కి తీసుకొచ్చిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ చర్య, ఏకోణంలో చూసినా అభినందనీయం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి