18, సెప్టెంబర్ 2021, శనివారం

చేతులెత్తి దండం

 🙏🏻 *_అందరికి చేతులెత్తి దండం పెట్ట కూడదా?_* 🙏🏻 🛎 నమస్కారం… భారతీయ సంస్కారం. కాదు, సంస్కృతిలో భాగం. ఇది ఒక గౌరవసూచకం. 👉మనషులందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు. దీనినే ఆత్మ అంటారు. 👉నమస్కారం పెట్టడం అంటే మన ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం. 👉కానీ, ప్రతి నమస్కరానికి ఒక విధానం ఉంది. అందరికీ చేతులెత్తి దండం పెట్ట కూడదట. 👉ఎవరికీ ఏ విధంగా నమస్కారం చేయాలి అనే అంశాలను పరిశీలిద్దాం 👉తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేస్తాం. 👉దేవుళ్లకు చేసే నమస్కారాలు ఒక విధంగా ఉంటాయి , గౌరవపూర్వకంగా మనుషులకు చేసే నమస్కారం మరో రకంగా ఉంటుంది. 👉శివకేశవులకు నమస్కరించేటపుడు తల నుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. అంటే చేతులెత్తి నమస్కరించాలి 👉హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు. 👉గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి . 👉తండ్రికి, ఇతర పెద్దలకు నోటికి నేరుగా చేతులు జోడించాలి. 👉తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి. 👉యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి. 🛎 మన శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి.......

కామెంట్‌లు లేవు: