ప్యారిస్ ఆఫ్ ఆంధ్రా అని ఏ పట్టణానికి పేరో తెలుసా. కొన్ని విషయాలను సంకేత రూపేణ తెలుపగలను. కాని ఆ పట్టణాన్ని కనుక్కోవడం మీ వంతే మరి. సరేనా. ప్రారంభిద్దాం.
1. మూడు కాలువల మధ్య ఈ ప్రాంతం ఏర్పడింది.
2. ప్యారిస్ లో వలే ఈ పట్టణంలో కూడా మెయిన్ రోడ్ కి రెండు వైపులా పెద్ద కాలువలు ఉండటం వలన ఈ పట్టణానికి ఈ పేరు స్థిరపడ్డది.
3.వైకుంఠ పురం అనే అద్భుతమైన వేంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఇంకా అనేక ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి.
4. ఎక్కడా లేనటువంటి దొంగరాముడి గుడి ఇక్కడ ఉండటం ఓ విశేషం. ఒక్క రాత్రిలో దొంగతనంగా రాముడి గుడి కట్టడం వల్ల ఆ పేరు వచ్చిందిట.
5. బంగారు నగల ఆభరణాలకి ప్రసిద్ధి పొందిన పట్టణం ఇది.
6. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి ముద్రణా యంత్రం ఇక్కడ 1930లో స్థాపించబడింది. పేరు కాకుమాన్ ప్రెస్.
7.ఫౌంటెన్ పెన్నుల తయారీకి కూడా వెరీ ఫేమస్.
8.వివిధ కళాకారులకి, సాహితీవేత్తలకి నిలయం ఈ పట్టణం. వివిధ రంగాల్లో సుమారు 200 మంది ప్రముఖులను మనకి అందించిన గొప్ప పట్టణం.
9.వారిలో కొంతమంది ప్రముఖుల పేర్లు తెలుసుకుందాం. వికటకవి తెనాలి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ లోనే తొలి మహిళా డాక్టర్ సత్యవతీ దేవి, పాప్యులర్ షూ మార్ట్ వ్యవస్థాపకుడు చుక్కపల్లి పిచ్చయ్య, అవార్డు విన్నింగ్ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి, వై నాయుడమ్మ, తొలి తెలుగు సూపర్ స్టార్ కృష్ణ, కళా వాచస్పతి కొంగర జగ్గయ్య, హంపీ సుందరి నటి జమున, గుణచిత్ర నటుడు గుమ్మడి, నటి ఊర్వశి శారద, తొలి తెలుగు సినీ డ్రీంగర్ల్ కాంచనమాల, హాస్యనటుడు ఏ వి యస్, తొలి తెలుగు నేపథ్య గాయకుడు ఎం ఎస్ రామారావు, విజయా సంస్థ అధినేత చక్రపాణి. ఇంకా కమ్యూనిస్టు వీరులు నండూరి ప్రసాదరావు, ఎం ఎస్ బాలగంగాధర రావు.
ఇప్పుడైనా గుర్తుకొచ్చెనా నేను ఏ పట్టణం గురించి చర్చిస్తున్నానని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి