భాస్కర రాజు గారి ప్రేరణతో ------
*సంసారం - సరిగమలు*
*కారణాలు*
*****************
(పద్య నడక - కందము)
1.
పతిని గనక విడిచుండెడి
స్థితి గతు లెఱుగని సతులకు
స్థిరమెటులమరూ !?
సతిని గనక పరసతులను
అతికుతులతొ వెంబడించి
చతికిల బడరా !
2.
గతి సుగతి ప్రగతి ప్రదముగ
బతుకుతు కొనసాగుతున్న
పరువము పదిలం !
కుతు లెఱుగని సతి పతులది
గతులెటులనొ సుగతి ప్రగతి
గాంతు లెటులనో !
3.
విసుగులతో లొసుగులతో
కసురు కొనెడి సతి పతులది
కాపురమెటులో !
కసుబుసు లాటలె ఎపుడును
ఇసుమంతయు ఇంపు సొంపు
ఇముడ దింటిలో !
4.
కుతి గలిసిన మతి గలిగిన
సతి పతులదె అసలు సిసలు
సంసారముహో !
ప్రతి కాపుర మిటులుండిన శ్రుతి మితి మీరద హాయిగ
శృంగార ముగన్ !
5.
ఈ నడవడి గల ఇంటిలొ
ఆనద ఆ స్వర్గము అహ !
ఆనందము నన్ !
జ్ఞానము ఆ యింటిలొ అ -
జ్ఞానమ్మును రూపు మాపు
జాణ యగునుగా !
6.
శ్రుతి కుతి గల సతి పతులే
అతిగా రాణించి ప్రేమ
పారాయణులై
భృతి అతి రుచి గల నిపుణత
చతికిల బడకుండ నెపుడు
సాగద ప్రీతిన్ !
7.
మితి మీరిన చెడు మతులతొ
స్థితి గానక నిక్కి నీల్గు
స్థితిలో యటులే
హితమెవరిది వినరు కనరు !
చితి సహితము ఈసడించు
స్థితి అది గాదా !
****************
రచన :---రుద్ర మాణిక్యం (✍️కవి రత్న) జగిత్యాల.
****************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి