4, మే 2026, సోమవారం

మార్జాల కిశోర న్యాయం:*

   *మార్జాల కిశోర న్యాయం:* 

 మార్జాలం అంటే పిల్లి.కిశోరం అంటే పిల్ల.పిల్లి తన పిల్లల్ని తనే రక్షించు కొంటుంది. పిల్లి కనిన తరువాత ఆపిల్లల్ని నోటితో పట్టుకొని వేరు వేరు ప్రదేశాలలో ఉంచుతూ అవి పెద్ద అయ్యేదాకా కాపాడుతూ ఉంటుంది.అలాగే మనం ముందుగ భగవంతుని ఆశ్రయించి ఉంటే  ఆస్వామి ఎందరినో కాపాడినట్లు “మార్జాల కిశోర న్యాయంలా”భక్తులను కాపాడుతాడు అని ఈన్యాయం తెల్పుతుంది .

 *మర్కట కిశోర న్యాయం:*  

కోతి పిల్ల తల్లి పొట్టని పట్టుకొనే ఉంటుంది .తల్లి కోతి,చెట్ల మించి ఎగిరి దూకేటప్పుడు పిల్ల కోతి తన రక్షణ తనే చూసుకొంటూ ఉంటుంది.అని తెల్పేదే “మర్కట కిశోర న్యాయం”  సదా ఆ స్వామినే పిల్లకోతి తల్లిని పట్టుకొని ఉన్నట్లు మనం ఆశ్రయించి ఉండాలి అనితెల్పేదే “మర్కట కిశోరన్యాయం.

 *భ్రమర కీటక న్యాయం* 

దీన్ని  గురించి క్లుప్తంగా.... భ్రమరం (తుమ్మెద) కీటకాన్ని (ఒక రకమైన పురుగు) తనతో తెచ్చుకొని  దానిచుట్టూ ఝుంకారం చేసుకుంటూ పదే పదే తిరుగుతుంది.అలా తిరిగేటప్పుడు మొదట భయంగా,తర్వాత ఏకాగ్రతగా,అటుపై తనను తానే  పూర్తిగా మరచిపోతుంది కీటకం.ఆ మైమరపులో కొద్దిరోజుల తర్వాత తానే భ్రమరంగా మారిపోతుంది కీటకం. ఇదే భ్రమర కీటకన్యాయం!అదే భావనతో భక్తుడు కూడా భగవంతుని మైమరచి తలుస్తే ,భక్తుడు సగుణరూపంలో ఉన్న భగవంతుడు అవుతాడని వేదాంతం తెలుపుచున్నది.

కామెంట్‌లు లేవు: