3, జులై 2023, సోమవారం

సోరియాసిస్

 సోరియాసిస్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -


      మనుష్యులకు వచ్చు అత్యంత తీవ్రమైన మరియు అంత సులభముగా  లొంగని ఒక వ్యాధి గురించి మీకు వివరిస్తాను. దాని పేరు  "సిద్మ కుష్టు"  దీనిని " సోరియాసిస్ " అంటారు. ఇది ఒక రకమైన కుష్టు వ్యాథిగా ఆయుర్వేదం పరిగణించినది . 18 రకాల కుష్టు వ్యాధులలో ఇది ఒకటి. ముఖ్యంగా దీని లక్షణాలు చర్మం పైన పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడి పొట్టు రాలడం . అదే విధముగా కీళ్ల భాగములో సోరియాసిస్ వచ్చినపుడు "సోరియాసిస్ ఆర్థరైటిస్ "

వచ్చును. ఇది అత్యంత మొండి వ్యాధి . 


    సోరియాసిస్ రావడానికి గల కారణాలు  -  


 *  ఒకదానితో ఒకటి పడని విరుద్దమైన ఆహార పదార్దాలు సేవించడం . అనగా పాలు చేపలు , పాలు పెరుగు, మాంసం పాలు  వంటి విరుద్దమైన ఆహారాలు తీసుకొవడం .


 *  మలము, మూత్రము , వాంతి , అపానవాయువు మొదలయిన సహజవేగాలు ని నియంత్రించడం . బలవంతంగా ఆపడం. 


 *  బాగా ఆహారాన్ని తిన్న వెంటనే కొంతసేపైనా విశ్రాంతి తీసుకోకుండా ఎండలో నడవడం. తిన్న వెంటనే  వ్యాయామం చేయడం . 


 *  చల్లని నీరు , పానీయాలు తాగి వెంటనే టీ మరియు కాఫీ వంటి వేడి పదార్దాలు సేవించడం . లేదా చల్లని గాలులు వీచే ప్రదేశంలో పనిచేసి ఒకేసారి ఎండ లోకి వచ్చి సమయం గడపడం.


 *  ఎక్కువరోజులు ఉపవాసం చేయడం , లేదా ఆలాపమైన భోజనాన్ని ఎక్కువరోజులు చేయడం . 


 *  కొత్త ధాన్యాలు , పెరుగు , చేపలు , ఉప్పు , పులుపు వీటిని ఎక్కువుగా తినే అలవాటు ఉండటం .


 *  మినుములు , ముల్లంగి , పిండిపదార్ధాలు , నువ్వులు , పాలు , బెల్లం వీటిని అమితంగా తినడం 

 *  తిన్న ఆహారం జీర్ణం కాక ముందే వెంటనే రతిక్రీడలో పాల్గొనడం . 


            ఇటువంటి ప్రధాన కారణాల వలన వాతం , పిత్తం , కఫం అనే మూడు దోషాలు ప్రకోపించబడి ఆహారం నుంచి పుట్టిన రసధాతువు ను , రక్తధాతువును , మాంసధాతువును , మేధోధాతువు ని కూడా దూషింప చేయడం వలన 18 రకాల కుష్ఠు వ్యాధులు కలుగుతాయి.


  సోరియాసిస్ ఉన్నవారు తీసుకోవలసిన ఆహార పదార్దాలు  - 


 *  పాతబియ్యంతో వండిన అన్నం మాత్రమే తినాలి 

 *  పాత గొధుమలు రవ్వలా , పిండిలా చేసుకొని జావ , రొట్టె తినవచ్చు. 


 *  పెసరపప్పు కట్టు, కందిపప్పు కట్టు తినవచ్చు. 


 *  బీరకాయ , పొట్లకాయ , ఆనపకాయ , దోసకాయ , వేపపువ్వుతో చేసిన కారంపొడి , కాకరకాయలు , పెరుగుతోటకూర , పొన్నగంటి కూర మెంతికూర , గలిజేరుకూర , ఆవుమజ్జిగ , ఆవునెయ్యి , తేనె , నీరుల్లి , సుగంధపాల వేళ్ళ కషాయం , పాతనిమ్మ , దబ్బ , ఉశిరిక , చింతపచ్చళ్ళు తినవచ్చు.  


  తినకూడని ఆహార పదార్దాలు  - 


 *  కొత్తబియ్యం అన్నం .


 *  చిక్కటి పులుసు .


 *  ఎక్కువ కారము . 


 *  ఆవకాయ.


 *  గుమ్మడికాయ.


 *  వెల్లుల్లి .


 *  దుంప కూరలు.


 *  మద్యపానము . 


 *  నువ్వులు . 


 *  మినుములు . 


 *  చెరుకు రసం.


 *  బెల్లం పానకం .


 *  చేపలు .


 *  మాంసము .


 *  కోడి మాంసము .


 *  వ్యాయామము .


 *  అతిగా సంభోగం . 


       పైన తెలిపినటువంటి  నియమాలు పాటిస్తే మీరు అతి తొందరలో సొరియాసిస్ నుంచి విముక్తి అవ్వగలరు.


 గమనిక -   ముఖ్యంగా మాంసం మరియు కొడి గుడ్డు , మినుములు మొదలయిన వేడి చేసే పదార్దాలు వ్యాధి తగ్గాక ఒక 6 నెలలు వరకు తినకుండా ఉంటే వ్యాధి ఇక జీవితంలో మళ్లి రాదు .  

         

    ఇది రావడానికి ప్రధానమైన కారణం . విరుద్దమైన ఆహారాలు భుజించటం వలన శరీరం నందలి రక్తం దోషం పొందటం వలన , తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన ఈ వ్యాధి సంప్రాప్తించును. దీనికి చికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకుని ఉన్నది. అల్లోపతి వైద్యవిధానము నందు దీనికి సంపూర్ణమైన చికిత్స లేదు . ఒక్క ఆయుర్వేదం మాత్రమే దీనికి సంపూర్ణ పరిష్కారం చూపించగలదు. ఈ సమస్యని నేను నయం చేయుటకు ఎంతో పరిశోధించి కొన్ని ఔషధ మిశ్రమాలను తయారుచేశాను . వీటితో అత్యంత సులభముగా " సోరియాసిస్ " సమస్యను నిర్మూలించవచ్చు. మొదటి 2 నుంచి 3 నెలలలో మీకు మార్పు వస్తుంది . 6 నెలలపాటు ఆపకుండా వాడవలెను . 


        నేను చెప్పిన విధముగా ఆహార నియమాలు పాటిస్తూ ఔషధాలు తీసుకొనుటకు ఇష్టపడువారు మాత్రమే నన్ను ఫోన్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు. మీరు సంప్రదించవలసిన నెంబర్ " 9885030034 " 


      కాళహస్తి వేంకటేశ్వరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          9885030034

కామెంట్‌లు లేవు: