30, మార్చి 2025, ఆదివారం

సీసము

 *సీసము*

శిశిరపు మోడుల చిగురులు తినిమరి

   ఆమని కోయిల లాలిపాడ

ప్రకృతిన చందన పరిమళములనిడు

   కొత్త చిగుళ్ళకు క్రొవ్విరులు

మానసమందున మధురోల్లసాదుల

   విశ్వావసువను వెలుగులగని

నూతన వత్సర భూతుల భాసము

   ఎల్లరి సుఖముల చల్లని దరి.

*ఆ.వె.*

మనసునమురిపెములు మధురానుభూతులు

జగమున వెలుగులకు మిగులు ముదము

సకల సౌఖ్యములకు స్వాగత సందడి

కొత్త వత్సరంపు కొలువు లివియె.


అందరికీ విశ్వావసు నామ నూతన ఆంధ్ర సంవత్సర శుభాకాంక్షలు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: