యు(ఉ)గాది...
లోకమును బ్రహ్మచే సృష్టించ బడిన రోజును యుగ ఆది పిలవడం జరిగింది. తెలుగు నేల యందు ఉగాది గాను, కన్నడ ప్రాంతమందు యుగాది గాను, మహారాష్ట్ర గోవా ప్రాంతాల యందు గుడి పద్వా అని పిలవడం జరుగుతోంది. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి కాల నామ సంవత్సరము చైత్ర మాసమందు మొదటి రోజును ఉగాది పర్వదినం నిర్వహించడ మైనది. పండుగ రోజు పంచాంగ శ్రవణం చేయడంతో పాటు ఉగాది పచ్చడిని సేవించడం చేయుదురు.
ప్రతి మనిషి జీవితంలో ఉండే ఆరు రకాల భావోద్వేగాలకు ఆరు రకాల షడ్రుచులను అన్వయిస్తారు.
సంతోషానికి మధురం అనగా తీపి, కోపమునకు కటువు అనగా కారము, ఆమ్లంనకు పులుపు, తిక్తం అనగా చేదు, వగరు, లవణం అనగా ఉప్పు, కషాయం అనగా వగరు వంటి గుణాలు కలిగిన చెరకు తేనే/బెల్లం, మిరప/మిరియం, చింత/నిమ్మ, వేప పువ్వు, ఉప్పు, మామిడి పిందె వంటి ప్రకృతి ప్రసాదించిన పండ్లు, పువ్వు, మిశ్రమాలను కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.
శరీర గుణాలైన వాత, పిత్త, కఫములను సమతూకము చేయడమే కాకుండా శరీరంలో అనేక దుష్ప్రభావాలు రాకుండా
షడ్రుచులు తగు పాళ్లలో సేవించడం ద్వారా శరీరం యొక్క రసాయన క్రియలలో క్రమబద్ధీకరణ జరుగుతుంది. ఈ విషయం ఆయుర్వేదం చెబుతోంది. అందుకే ఉగాది పచ్చడికి అంత ప్రాశస్త్యం కలదు. వసంత కాలం నుండి గ్రీష్మ కాలం వరకు వేడి పెరిగి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
అందుకే ఈ ఋతువులలో శరీరానికి షడ్రుచులు అందించడం మేలుకరం.
ఉగాది పండుగ సంవత్సరానికి తొలి రోజున జరపడం తెలుగు, కన్నడ ప్రాంతీయులు నిర్వహించడం చేస్తుంటారు.
ముఖ్యంగా తెలుగు నేల యందు పంచాంగ శ్రవణం ముఖ్య కార్యక్రమంగా నిర్వహిస్తారు.
కొత్త సంవత్సరంలో రాశులు, నక్షత్రాల గమనం ప్రకారం జాతకాలను వినడం చేస్తుంటారు. నూతన కాల పయనంలో పంటలు, వర్షాలు, ప్రమోదాలు, విపత్కరములు వంటి గురించి సంఘ, వ్యక్తిగతంగా పూజ్యం, అవమానంలతో పాటు ఆదాయం, ఖర్చు వంటి భవిష్యత్తు ఆశాజనక విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది.
*అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు.*
మన అందరికి ఈ ఉగాది పండుగ కొత్త జవసత్వాలు కూడిన
నూతన శక్తిని కలిగించాలని మనసారా కోరుకుంటున్నాను.
మీ,
అశోక్ చక్రవర్తి నీలకంఠం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి