30, మార్చి 2025, ఆదివారం

నవ్యశోభల యుగాది,

 ,,,,,,శీర్షిక:నవ్యశోభల యుగాది,,,,,


నవ వధువు వోలే

నవయవ్వన హొయలతో

నవవిధ శుభాలను

నవరత్న సహిత సిరులను

తీసుకొస్తోంది మోసుకొస్తోంది

నవయుగాది నవసంవత్సరాది


భవ్య భూషణ భోగాలను

భవ్య శోభిత అనురాగాలను

భవ్య భోగ భాగ్యాలను

భవ్యతర ఘనతర రాశి ఫలాలను

భవ్య శ్రావ్య కోయిల గీతాలను

తెస్తోంది వినిపిస్తోంది నవ్యయుగాది


మమతలకు మమకారాలకు

ఆప్యాయతలకు,అనురాగాలకు

ఆలోచనలకు,ఆచరణలకు

షడ్రుచులకు, అభిరుచులకు

ఆలంబనగా తానున్నానంటూ

ఆశ్రయమిస్తూ వచ్చేను నవ్యయుగాది


తెలుగు వారికి తోబుట్టువుగ

తెలుగు వాకిట తులసిమొక్కగ

తెలుగు జాతికి కంటిదివ్వెగ

తెలుగు జగతికి ఘనతగ 

వెలుగును పంచడానికి వస్తోంది నవ్యయుగాది


కవిపేరు:కూని.అంకబాబు

ఊరు:నెల్లూరు

చరవాణి:9640637991

కామెంట్‌లు లేవు: