30, మార్చి 2025, ఆదివారం

సప్తవర్ణాల ఉగాది

 

 కవిత శీర్షిక : సప్తవర్ణాల ఉగాది 

 వచ్చింది తెలుగు మాసం తెచ్చింది సప్తవర్ణాల సంతోషం 

 చిత్రంగా చైత్రం మళ్ళీ వచ్చింది 

 వసంతోత్సవ వర్ణాలన్నీ 

 ప్రకృతి తనలో నింపుకొని వయ్యారం వలకబోస్తున్నది 

 ఆమని ఆహ్వానం అందుకొని కోయిలమ్మ గొంతు సవరించుకుంది 

 ఇంటింటా మామిడి తోరణాలతో షడ్రుచులకమ్మదనాలతో 

 పల్లె వేపా మామిడి పూతలతో పుష్పాలతో హాయిగా మురిసింది 

 పసుపుపచ్చని చామంతి ఆకుపచ్చని చీర చుట్టి 

 నీలిరంగు సెలయేరు లాంటి కురులారబోసి 

 చెంపల కెంపుల ఎరుపు రంగులద్ది 

 చల్లని మలయ సమీరాలతో 

 నల్ల కలువ లాంటి కళ్ళలో 

 ఆశల దీపాల హారతులు ఇస్తూ 

 చిత్రంగా చైత్రం మళ్ళీ వచ్చింది 

 విచిత్రంగా ఆశల చిగురింపజేసింది చైత్రం 

 ఊదా రంగు ఊహలను నిజాలు చేస్తూ 

 మది ఊయల లూప మళ్లీ వచ్చింది తెలుగు మాస ఆది ఉగాది 

 అందరికీ విశ్వావసు నూతన సంవత్సరం శుభాకాంక్షలు

సభా సరస్వతికి నమస్కారం

 నేను అనిత రాణి కాంచనపల్లి 

కామెంట్‌లు లేవు: