కవితా శీర్షిక:
""" శ్రీకారం చుట్టాలి """
వనమంతా పల్లవమై ప్రకాశిస్తూ
చిగురాకుల తరువులలో చిలకమ్మల కువకువలతో
మావిచిగురు తిని మత్తుగా కోయిలల కుహుకుహులతో
మధురాశల మానవ స్వప్నాలతో
మదినిండా ఆమని అందాలను నింపుకొని
అడవితల్లి హరివిల్లు చీరకట్టి
చెంగావి రవిక తొడిగి
చైత్రమాసపు చైతన్య దీప్తియై
నవతకు నాందిగా మానవతకు పునాదిగా
ఉజ్వల భవితకు వారిధి గా
నవ నవోన్మేషపు యశస్సుల ఉషస్సులతో
మా ఆ (శ) యాలను నెరవేర్చే కల్పవల్లియై
నవ్య యుగాది ఉదయించాలి
నవ సమాజ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి!
తెలుగువారి తొలి పండుగయై
యుగానికి ఆదియై
ఉత్సాహనికి వేదికయై
జనుల విశ్వాసానికి ప్రతీకయై
విశ్వావసు అరుదెంచాలి!!!
***********************
(మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పర్వదిన
శుభాకాంక్షలు )
***********************
డాక్టర్ ఆళ్ళ నాగేశ్వరరావు
( కమల శ్రీ )
తెనాలి
చరవాణి :7416638823
***********************
(ప్రస్తుతం ఐర్లాండ్ దేశం నుంచి....)
************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి