🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏
*🌼శుభోదయం*🍃
-------------------
🏵️ *మహనీయుని మాట*🏵️
-------------------------
"నిరాడంబరత, నిర్భయత్వం, నిరహంకారం, నిర్మలత్వం, నిర్మోహం వంటి ఉదాత్త లక్షణాలు వ్యక్తులకు సహజమైన అలంకారాలుగా వర్ధిల్లుతాయి."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌹
---------------------------
"అందరూ నచ్చేలా, మెచ్చేలా చేయాలంటే అసాధ్యం!! నీకు ఏది మంచిదో అదే చెయ్యి. దాని వలన ఇతరులకు కీడు జరగకుండా చూసుకో.భగవంతుడు నీతోనే ఉంటాడు."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
:
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*30, మార్చి, 2025*
*దృగ్గణిత పంచాంగం:*
➖➖➖✍️
*సూర్యోదయాస్తమయాలు:*
ఉ 06.04 / సా 06.20
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : మీనం/మేషం
🌺ఈనాటి పర్వం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం *యుగాది*
*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం*
*వసంత ఋతౌః / చైత్ర మాసం/ శుక్లపక్షం*
*తిథి : పాడ్యమి* మ 12.49 వరకు ఉపరి విదియ
*వారం : ఆదివారం* ( భానువాసరే )
*నక్షత్రం : రేవతి* సా 04.35 వరకు ఉపరి అశ్విని
*యోగం : ఐంద్ర* సా 05.54 వరకు ఉపరి వైధృతి
*కరణం : బవ* మ 12.49 బాలువ రా 10.59 ఉపరి కౌలువ
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00 - 10.30 మ 02.00 - 04.00*
అమృత కాలం : మ 02.28 - 03.52
అభిజిత్ కాలం : ప 11.47 - 12.36
*వర్జ్యం : శేషం ఉ 07.25 వరకు*
*దుర్ముహూర్తం : సా 04.42 - 05.31*
*రాహు కాలం : సా 04.48 - 06.20*
గుళికకాళం : మ 03.16 - 04.48
యమగండం : మ 12.12 - 01.44
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం : ఉ 06.04 - 08.31
సంగవ కాలం : 08.31 - 10.58
మధ్యాహ్న కాలం : 10.58 - 01.25
అపరాహ్న కాలం : మ 01.25 - 03.53
*ఆబ్ధికం తిధి : చైత్ర శుద్ధ పాడ్యమి/విదియ*
సాయంకాలం : సా 03.53 - 06.20
ప్రదోష కాలం : సా 06.20 - 08.41
రాత్రి కాలం : రా 08.41 - 11.48
నిశీధి కాలం : రా 11.48 - 12.35
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.29 - 05.16.
🥀 *శ్రీ విశ్వా వసు నామ ఉగాదిరోజు ఆచరణ* 🥀
🥀 1. *తైలాభ్యంగన స్నానం*
ఉగాది రోజున విధిగా శరీరానికి నల్ల నువ్వుల నూనెతో మర్దన చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయాత్ పూర్వం కానీ స్నానం ఆచరించాలి. స్నానం చేస్తూ గంగా గంగా గంగా అని
3 సార్లయినా ఉచ్చరించాలి.
🥀 2. *నూతన వస్త్ర ధారణ* :
స్నానం చేసాక కుదిరితే నూతన వస్త్రాలు కట్టు కోవాలి. కుదరకపోతే ఉతికిన సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. ఆడా మగ ఎవరైనా సరే షార్టులు - చడ్డీలు ధరించి దేవుడి ముందు కూర్చోవద్దు.
🥀 3. *దేవతార్చన* :
నిత్య పూజ విధులు పూర్తయ్యాక కుటంబ సభ్యులందరూ కలిసి బ్రహ్మ దేవుడి ప్రార్థన సంవత్సరాది స్తోత్రం ప్రార్ధన చేయాలి.
🥀! *బ్రహ్మ స్తుతి* !
ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే !
నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే !!
నమస్తే బహు రూపాయ విష్ణవే పరమాత్మనే !!!
🥀 *సంవత్సరాది స్తోత్రం*
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహం !
అజారూడం చతుర్హస్తం ద్వి శీర్షం *ప్లవ* సంజ్ఞకం !!
🥀 4. *పంచాంగం పూజ*
శ్రీ విశ్వా వసు
నామ సం.ర పంచా౦గాన్ని పూజించాలి.
🥀5. *నింబ కుసుమ భక్షణం*
పూజా మందిరంలో ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి కింది శ్లోకం చదువుకుంటూ ప్రాసన చేయాలి.
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ |
సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం | |
🥀6.దానం
పితృ దేవతల ఆశీస్సుల కోసం ఉగాది రోజున చల్లని నీటి పాత్రను దానం చేయాలి. అలాగే తెల్లని వస్త్రాలు, గొడుగు, విసనకర్ర, చెప్పులు కూడా అవకాశం ఉన్నవారు ఇవ్వవచ్చు
🥀 7. *పంచాంగ శ్రవణం*
సాయంత్రం ఇంటిల్లిపాది అందరూ కలిసి దగ్గరలోని ఆలయానికి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకొని, పంచాంగ శ్రవణం చేసి తమ రాశి ఫలాలను తెలుసుకొని పంచాంగ శ్రవణం చేయించిన పండితులవారి ఆశీస్సులు తీసుకోవాలి.
🌈శుభమస్తు 🙌
🙏లోకాః సమస్తా సుఖినోభవంతు🙏
🌱🌱🌱🧘♀️🧘♀️🧘♀️🌱🌱🌱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి