8, జూన్ 2022, బుధవారం

ఏరువాక సామెతలు


ఏరువాక సామెతలు


నక్షత్రాల పేరుమీదుగా కార్తెలను వ్యవహరిస్తారు. ఇవి వాతావరణంలో వచ్చే మార్పులను సూచిస్తాయి. తెలుగునాట వర్షాకాలం రోహిణి కార్తె తరువాత ఏరువాక పున్నమితో ప్రారంభమవుతుంది. సాధారణంగా ఆ సమయానికి మృగశిర లేదా ఆరుద్ర కార్తెలుంటాయి. ప్రధానమైన ఆ రెండుకార్తెలలో కురిసే వర్షాన్ని అంచనా వేయడానికి రైతన్న కొన్ని సామెతలను సృష్టించుకున్నాడు.


మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడతాయి. మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలింకా ఇస్తాయి.


మృగశిర వర్షిస్తే మఖ గర్జిస్తుంది. మృగశిర కురిస్తే ముక్కారు పంట పండుతుంది. మృగశిర చిందిస్తే అయిదు కార్తెలూ వర్షిస్తాయి


ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలూ కురుస్తాయి. ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యం లేదు. ఆరుద్రలో అడ్డెడు చల్లితే 'పుట్టెడు పండుతాయి. ఆరుద్ర వాన ఆదాయాల బాన. ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి. ఆరుద్రలో వేసిన విత్తనం అరిటాకులో అన్నం. ఆరు కార్తెలు పోతే ఆరుద్రే దిక్కు. ఆరుద్రలో వర్షం అమృతంతో సమానం,

కామెంట్‌లు లేవు: