6, మే 2021, గురువారం

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


మొక్కుబడిగా చేసే పనుల వలన ఉపయోగం ఏదీ ఉండదు.


మనలో ఆధ్యాత్మిక విలువలు మేల్కొనడాన్ని గ్రహించినప్పుడు మనలో ఆనందం కలుగుతుంది. ఇది పవిత్రత ద్వారా వస్తుంది.


ఆ ఆధ్యాత్మిక విలువల నిజమైన అంతరార్థాన్ని గ్రహించాలి. ఆ మహోన్నత భావాలు మన మనస్సులో చక్కగా లగ్నమై ఉండాలి.


మన మనస్సు, హృదయం, కర్మలు ఎల్లప్పుడూ సుందరమైన, సువిస్తృతమైన వాటినే ఉత్పన్నం చేయాలి. లేకపోతే అవే మనకు హాని కలిగిస్తాయి.


మనం చేసే ప్రతీ పని చక్కనైన, యోగ్యమైన ఫలితాలనే అందివ్వాలి. యాంత్రికంగా చేసే పనులకు ఫలితం కూడా ఆ విధంగానే వస్తుంది.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: