6, మే 2021, గురువారం

టీకా పీక నొక్కిందెవరు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

1. *టీకా పీక నొక్కిందెవరు?*       (ఋజువులతో సహా)

2. ఎవరికి లాభం చేకూర్చడానికి చేశారు?

==============


1. టీకా పీక నొక్కిందెవరు? (ఋజువులతో సహా)


భారత ప్రభుత్వం కరోనా టీకా కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరిలో ప్రకటించగానే.. ఒక్కసారిగా ప్రతిపక్షాల నాయకులూ వాటికి ఒత్తాసు పలికే మీడియా, వారి ప్రోద్బలంతో ఇంకా అనేకమంది టీకా కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకొనేలా ప్రకటనలు గుప్పించారు, హేయంగా ప్రవర్తించారు.  ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి తప్పు దోవ పట్టించి టీకాపై వ్యతిరేకత పెచ్చరిల్లేలా చేసి.. దేశానికి, ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టారు.. ఒకరి తర్వాత ఒకరు, వీరి లీలలు క్రింద చదవండి.. కేవలం టీకాపై దుష్ప్రచారమే కాకుండా వీరు చేసిన ప్రచారానికి వేరే ఆశయం కూడా ఉంది.. అదే స్వదేశీ టీకా "కోవ్యాక్సిన్" ను దెబ్బతీసి అమెరికా, యూరోప్ లకు చెందిన టీకాలకు మద్దతు ఇవ్వడం.. దేశంలో వినియోగానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం.. ఎందుకు అలా చేశాయో తెలుసా? చదవండి క్రింద..


ముందు టీకాను వ్యతిరేకించిన వివిధ వ్యక్త్రుల ప్రకటనలు చూడండి.. వీరు టీకాపై చేసిన దుష్ప్రచారానికి ఆధారాలుగా వీరి ప్రకటనలు, ఆర్టికిల్స్, ఇంటర్వ్యూలు, ట్వీట్లు కూడా జతచేయబడ్డాయి.


1. *అఖిలేష్ యాదవ్*     

      (సమాజ్‌వాదీ పార్టీ)


అది బీజేపీ వ్యాక్సిన్.  నేను ఆ టీకా వేసుకోను అని టీవీ కెమేరాల సాక్షిగా జనవరి 3న ప్రకటించాడు.. ఇదే పార్టీకి చెందిన ఒక ముస్లిం నాయకుడైతే పదడుగులు ముందెకేసి, కరోనా టీకా వేసుకొంటే నపుంసకులు అవుతారని ప్రకటించాడు.


2. రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్


టీకాలు తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తాయి అనేదాంట్లో ఏ సందేహం అక్కర్లేదు.  టీకాల వల్ల ఏ సమస్యా లేకపోతే, అవి సురక్షితం అయితే  ప్రధాని, కేంద్ర ఆరోగ్య మంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, వారి సీఎంలు టీకాలు ముందుగా ఎందుకు వేసుకోవట్లేదు అని టీవీ ఛానెళ్ళ సాక్షిగా ప్రశ్నించాడు.


3. మనీష్ తివారీ, కాంగ్రెస్


దాని పనితీరు, విశ్వసనీయత మీద సందేహం ఉన్న వారెవరైనా ఈ టీకాలను వేసుకుంటారా? (Jan 5, 2021)


4. శశిథరూర్, కాంగ్రెస్


కోవ్యాక్సిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోలేదు.  దానికి అనుమతివ్వడం తొందరపాటు చర్య.  ప్రజల ప్రాణాలకు ప్రమాదం. (Jan, 03 2021)


5. మాఫియా అనుకూల వ్యాపారవేత్త, బజాజ్ ఆటో అధిపతి రాజీవ్ బజాజ్:


టీకా వేసుకోవడంవల్ల వచ్చే దుష్పరిణామాలు, దాని ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉంటాయా?  అంటూ తనలాంటి వ్యక్తికి టీకా ప్రయోజనాల కంటే ముప్పే ఎక్కువ అన్నట్లు, అటూ ఇటూ కాని అభిప్రాయం వ్యక్తం చేశాడు.


6. చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ హెల్త్ మినిస్టర్ TS సింగ్ దేవ్


చత్తీస్‌గఢ్ రాష్ట్ర టీకా కార్యక్రమంలో కోవ్యాక్సిన్ చేర్చము అని స్పష్టంగా ప్రకటించాడు (10 Jan 2021).  టీకాలు అన్నిరకాల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని, సురక్షితం, ప్రభావవంతం అని తేలితేనే టీకా కార్యక్రమం మొదలు పెడతాం అన్నారు.


7.  ప్రశాంత్ భూషణ్, పేరుమోసిన అర్బన్ నక్సల్, లాయర్:


కోవిడ్ దేశం నుండి పూర్తిగా మాయమవుతుంటే, సామర్థ్యం నిరూపించుకోని ప్రైవేట్ కంపెనీల టీకాపై ప్రజల డబ్బు  ధార పోయడానికి, ప్రభుత్వం ఈ టీకా కార్యక్రమం తెరపైకి తెచ్చింది అని నిస్సిగ్గుగా ప్రకటన చేశారు.  (Feb 01, 2021) 


8. మమతా బెనర్జీ బెంగాల్ సీం, భూపేష్ బెగల్ కాంగ్రెస్, చత్తీస్‌గఢ్ సీఎం.


టీకాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయకపోయినా, ప్రజల్లో వాటిపట్ల సానుకూలతను పెంచడంలో ఎటువంటి పాత్ర పోషించలేదు.  ఒకరు బెంగాల్ ర్యాలీల్లో బిజీగా ఉంటే, వేరొకరు అస్సాం ప్రచారంలో నిమగ్నమయ్యారు.  ప్రధాని నిర్వహించిన కోవిడ్ సమీక్షా సమావేశాలకు కూడా ఈ ఇరువురూ డుమ్మా కొట్టారు.


9. అసదుద్దీన్ ఒవైసీ AIMIM


స్వదేశీ ఉత్పత్తికి మద్దతుగా నిలవడానికి, అప్పటికే ఈ టీకాపై అనేక సందేహాలు వెలిబుచ్చుతున్న స్వదేశీటీకా వ్యతిరేకుల నోళ్ళు మూయించి ప్రజలకు ధైర్యం ఇవ్వడానికి,  ప్రధాని భారత్ బయోటెక్ తయారీ టీకా కోవ్యాక్సిన్ వేయించుకుంటే, సీరం తయరీ విదేశీ టీకా సమర్థవంతమైంది కాదా అని చచ్చు చర్చ తెచ్చాడు. దానిపై ప్రజలకు, ముఖ్యంగా తన వర్గ ప్రజల్లో ఆందోళన రేకెత్తించడానికి. (March 1, 2021) 


10. నవాబ్ మాలిక్, NCP


టీకా మీద ప్రజలకు  అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకే, ప్రధాని ముందుగా ఈ టీకా వేసుకోవాలి. (Jan 11, 2021)


11. సాగరికా ఘోష్, జర్నలిస్ట్ 


టీకాలను అనుమతించిన విధానంపై నమ్మకం లేదని, ప్రభుత్వం ట్రయల్స్ పూర్తి కాకుండా టీకా కార్యక్రమం ప్రకటించకూడదు అనీ, దానివల్ల ఇంకా పెద్ద ఉపద్రవం ముంచుకొస్తుందనీ ప్రచారం చేసింది.  మరి ఈమెకెవరు చెప్పారో చెవిలో నమ్మకం లేదని. (Jan 3, 2021) 


12. స్వాతి చతుర్వేది, జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది


భారత్ బయోటెక్ టీకా మీద నా నమ్మకం సున్నా.  ఆ టీకాను నేను వేసుకోను.. మళ్ళీ ఈమే ఎప్పుడైతే కేసులు పెరుగుతున్నాయో వెంటనే ట్విట్టర్ వేదికగా టీకా కావాలని మొత్తుకుంది..


13. న్యూస్ ఛానెల్ "న్యూస్  

       24" యాంకర్ "సందీప్   

       చౌధరీ."


ఏమన్నాడో చూడండి.. కోవ్యాక్సిన్ ఫేస్-3 ట్రయల్స్ పూర్తై, దాని పనితీరు నిరూపితమయ్యే వరకు ఆ టీకాను ఎట్టి పరిస్థితుల్లోనూ వేయించుకోను.. అంటూ జనవరి 6న నిక్కచ్చిగా చెప్పాడు.. అదే పెద్దమనిషి, కరోనా కేసులు పెరగడం మొదలవ్వగానే, టీకా కావాలని గొంతు చించుకోవడం మొదలుపెట్టాడు.


14. రోహిణీ సింగ్, జర్నలిస్ట్


భారత్ బయోటెక్ తయారీ స్వదేశీ టీకాపై ఎక్కడలేని దుష్ప్రచారం చేసింది.  పైగా అమెరికన్ కంపెనీలైన ఫైజర్/మోడర్నా వారి టీకాలకు మద్దతుగా ఆర్టికిల్స్ రాసి ప్రచారం చేసింది.  భారత ప్రభుత్వం ఈ కంపెనీల టీకాలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ఇళ్ళపైకప్పుల నుండి గొంతు చించుకొని గగ్గోలు పెట్టింది.  ఏకంగా తాను, ఫైజర్ టీకాను ఎంచుకుంటాను అంది.


15. బల్బీర్ రాజెవాల్ (SKM రైతు నాయకుడు)

      జోగీందర్ ఉగ్రహాన్ (BKU రైతు నాయకుడు)


మాకు టీకా అక్కర్లేదు.  మేము కరోనాను ఎప్పుడో చంపేశాం.  పొలాల్లో కష్టపడి పనిచేయడంతో, రైతులకు బలమైన రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది.   రైతులెవరూ కరోనాకు భయపడడం లేదు. ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇచ్చి రైతుల్లో తప్పుడు భద్రతా భావం కలిగించారు.  ఇప్పుడు పంజాబ్‌లో అనేక మంది రైతులు కరోనాకు బలవుతున్నారు.  ఢిల్లీ బోర్డర్ నుండి వెనక్కు తిరిగి ఇంటికి వస్తున్న వారిని, వారి కుటుంబ సభ్యులు ఇళ్ళకు కూడా రానివ్వడం లేదు. 


16. The Print (Media)


టీకాలపై ప్రజల్లో వ్యతిరేకత పెచ్చరిల్లేలా, అనేక ఆర్టికిల్స్ రాసింది.  దేశ ప్రజానీకానికి టీకాలంటే భయం కలిగేలా ప్రచారం చేసింది.


17. మైనారిటీ వర్గానికి చెందిన అనేక మంది అపరిచిత వ్యక్తులు


టీకా హలాల్ కాదని అని, హరాం అనీ, అలాగే టీకా తయారీలో వాడే పదార్థాలపైనా అనేక అనుమానాలు, ఆందోళన కలిగించే ప్రచారానికి పూనుకున్నారు. ఇదంతా టీకా స్వీకారానికి వ్యతిరేకతను పెంపొందించింది.


18. సతీష్ ఆచార్య అనే లెఫ్ట్ లిబరల్, కాంగీ అనుకూల కార్టూనిస్ట్


కోవిడ్ టీకాపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా టీకాలపై అభద్రతాభావం కలిగించేలా అనేక కార్టూన్లు వేశాడు.  అదే పెద్దమనిషి, కరోనా కేసులు పెరగడం మొదలవ్వగానే, క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే ముందుకు దూకి ఏప్రిల్ 16న పరిగెత్తుకుంటూ వెళ్ళి టీకా వేయించుకున్నాడు..

===============


2. ఎవరికి లాభం చేకూర్చడానికి చేశారు?


చూశారుగా పైన, దాదాపు అందరి పల్లవి ఒక్కటే.. అందరి ధ్యేయం ఒక్కటే.. అదే, స్వదేశీ టీకా ఐన భారత్ బయోటెక్ తయారీ "కోవ్యాక్సిన్‌ను" మన దేశ టీకా కార్యక్రమం నుండి తప్పించాలి.. ప్రజల్లో దానిపై వీలైనంతగా వ్యతిరేకతా, అభద్రతాభావం కలిగించాలి.. ఎందుకంటే, ఈ టీకా తయారీ విధానం అత్యుత్తమమైనది.. సురక్షితమైనది.. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని టీకాలకన్నా ఇది గొప్ప పనితీరు కనబరచడమే కాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా తక్కువ అని క్లినికల్ ట్రయల్స్‌లో ఋజువైంది.  ప్రస్తుతం దాని తయారీ సామర్థ్యం చాలా తక్కువ.. కానీ మోదీ ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారంతో అనతి కాలంలోనే దాని తయారీ సామర్థ్యం పెంచుకోబోతోంది.. 


ఈ ఏడాది చివరికి 100 కోట్ల డోసుల టీకా తయారు చేసే విధంగా అది ప్రణాళికలు వేసింది.  ఒకసారి దీని సామర్థ్యం అంత మొత్తానికి చేరుకొంటే ఇక భారతీయ మార్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకొన్న అనేక అంతర్జాతీయ, ముఖ్యంగా అమెరికాకు చెందిన, కంపెనీల ఆశలు అడియాసలవుతాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం తన దేశపు ఫార్మా కంపెనీలకు, కేవలం కరోనా టీకాపై పరిశోధన, అభివృద్ధికి, తిరిగి ఇవ్వక్కర్లేని విధంగా దాదాపు 90 వేల కోట్లు ఆర్థిక సహాయం చేసింది.  ఈ మొత్తాన్ని, ఆయా కంపెనీలు నేరుగా అమెరికా ప్రభుత్వానికి చెల్లించవలసిన అవసరం లేకపోయినా, ఆ కంపెనీలు తాము తయారు చేసే ఉత్పత్తిని ఇతర దేశాల నెత్తిన రుద్ది, ఆదేశాలనుండి విదేశీ మారకం అమెరికాకు తెచ్చిపెట్టేందుకు సకల ప్రయత్నాలూ చేస్తాయి.. అసలిదే అమెరికా వ్యవస్థ యొక్క కుటిల విధానం.. అమెరికా ప్రభుత్వం పెద్ద ఎత్తున తన దేశపు కంపెనీలకు భారీ మొత్తంలొ నిధులు అందజేస్తుంది.. పరిశోధన అభివృద్ధికి.. ఆ కంపెనీలు తిరిగి చెల్లించ వలసిన అవసరం ఉండదు.. కానీ అవి తయారు చేసే ఉత్పత్తులను సాటిలేని వాటి కుటిల మార్కెటింగ్ నైపుణ్యం ఉపయోగించి  ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేసి విదేశీ మారకం తద్వారా పన్నుల రూపంలో తిరిగి అమెరికా ప్రభుత్వానికి అవి తీసుకున్న నిధులకంటే ఎన్నో రెట్లు ఎక్కువ చెల్లిస్తాయి.. దీనికోసం అవి అనేక నికృష్ట విధానాలకూ ఏమాత్రం మానవత్వం లేని పద్దతులకూ వెనుకాడవ్.. అందులోనూ ఇప్పుడు అనేక ప్రపంచ దేశాలనే కాక, అమెరికాలో ట్రంప్ పదవీచ్యుతుడు కావడానికి కారణం ఐన సోరోసురుడు నేరుగా రంగంలోకి దిగినట్లు రష్యా నిఘా వర్గాలు భారత ప్రభుత్వానికి ఉప్పందించాయి.


    అందరి ధ్యేయం ఒక్కటే.. జాతీయవాద మోదీని తప్పించి..  పప్పూని అధికారపీఠంపైకి తేవడం.. అందులో భాగంగా వీరు చేయని అకృత్యం లేదు.. ఏచిన్న అవకాశాన్నీ జారవిడుచుకోరు.. అందుకే ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీకా కార్యక్రమాన్ని దెబ్బతీసి కరోనా తీవ్రమయ్యేలా చేసి, ప్రజల్లో అశాంతి రేకెత్తించాలనేది వీరి పన్నాగం.. ఇంకొకటి సోరోసురుడు చెప్పినట్లుగా, భారతదేశ స్వదేశీ టీకా భారత్ బయోటెక్ "కోవ్యాక్సిన్‌ను"  దెబ్బతీసి, అమెరికన్ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడం.. 


అందుకే దేశంలోని ధూర్త రాజకీయ నేతలు, మీడియాసురులు, సామాజిక కార్యకర్తల రూపంలో ఉండే అర్బన్ నక్లైట్, ఇంకా అనేక మంది మూకుమ్మడిగా, కలిసికట్టుగా మన టీకా కార్యక్రమంపై, ముఖ్యంగా స్వదేశీ టీకా ఐన కోవ్యాక్సిన్‌పై దుర్మార్గమైన దుష్ప్రచారానికి తెరతీశారు.. దీనికి తోడు, మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా, టీకా ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ముడి పదార్థాలూ అలాగే ఇతర మందులు, వైద్య పరికరాలు భారత్‌కు అందించడానికి అమెరికా మొదట విముఖత వ్యక్తం చేసింది, "అమెరికా ఫస్ట్" అనే దాని సహజ విధానాన్ననుసరించి.. తరువాత  దిగొచ్చి కావాలసిన సహాయం అంతా చేస్తానని ముందుకు రావడమే కాకుండా ఇప్పుడు శరవేగంగా భారత అవసరాలు తీరుస్తోంది.  దీని వెనుక మర్మం ఏమిటో అందరికీ తెలిసినదే. ఇది కూడా దాని సహజ   విధానంలో భాగమే.., అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు..

   ఇలా చేసే కధా కరోనా మహమ్మారి ప్రబలే లా చేసి ఇప్పుడు నోటికి వచ్చినట్టు వక్రీకరణ లు చేస్తున్నారు. 

*జైభారత్.*

కామెంట్‌లు లేవు: