కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ఇలా..
⇒ మొదట కొవిన్ పోర్టల్(cowin.gov.in)లో లాగిన్ చేసి, మొబైల్ నంబర్ నమోదుచేయాలి. ఆ వెంటనే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
⇒ ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌ను క్లిక్ చేయాలి. అంతా ఓకే అయితే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్’ పేజ్ ఓపెన్ అవుతోంది.
⇒ దాంట్లో ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
⇒ ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. దానికోసం పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్‌ను క్లిక్ చేయాలి.
⇒ పిన్‌కోడ్ ఎంటర్ చేసి, వెతికితే..దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. అంతేకాకుండా టీకా కోసం ఆరోగ్య సేతు యాప్‌లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి