24, అక్టోబర్ 2020, శనివారం

🌷శ్రీ దుర్గా సప్త శ్లోకీ

 🌷శ్రీ దుర్గా సప్త శ్లోకీ.🌷


దుర్గా సప్తసతి అందరూ చదవలేరు.. కానీ..రోజూ.

ఈ స్తోత్రమును చదివితే.. దుర్గా సప్తసతి పారాయణ చేసినంత ఫలితాన్ని పొందుతారు.


ఓం  అస్యశ్రీ  దుర్గా సప్త  శ్లోకీ స్తోత్రమంత్రస్య,  

నారాయణ ఋషిః,  అనుష్టుప్ ఛందః, 

మహంకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వత్యో దేవతాః,  

శ్రీ దుర్గాంబా ప్రీత్యర్థం..

సప్త శ్లోకీ దుర్గా పాఠే జపే వినియోగః !!


1- ఓం  జ్ఞానినా  మపి  చేతాంసి  దేవీ  భగవతీ  హి  సా !

   బలాదా  కృష్యమోహాయ  మహామాయా  ప్రయచ్ఛతి !!


2- ఓం  దుర్గే  స్మృతా  హరసి  భీతి  మశేష  జంతోః,

     స్వస్థైః  స్మృతా  మతిమతీవ  శుభామ్  దదాసి !

     దారిద్ర్య  దుఃఖ  భయహారిణి  కా  త్వదన్యా,

     సర్వోపకార  కరణాయ  సదార్ద్ర  చిత్తా !!


3- ఓం  సర్వ  మంగళ  మాంగళ్యే  శివే  సర్వార్థ  సాధికే !

     శరణ్యే  త్ర్యయంబికే   దేవీ  నారాయణీ  నమోస్తుతే !!


4- ఓం  శరణాగత  దీనార్త  పరిత్రాణ  పరాయణే !

     సర్వస్యార్తి  హరే  దేవీ  నారాయణీ  నమోస్తుతే  !!


5- ఓం  సర్వ  స్వరూపే  సర్వేశే  సర్వశక్తి  సమన్వితే !

     భయేభ్య  స్త్రాహినో  దేవీ  దుర్గే  దేవీ  నమోస్తుతే !!


6- ఓం  రోగా  నశేషా  నపహంసి  తుష్టా

     రుష్టాతు  కామాన్  సకలా  నభీష్టాన్ !

     త్వా  మాశ్రితానాం  న  విపన్నరాణాం

     త్వా  మాశ్రితా  హ్యాశ్రయతాం  ప్రయాంతి !!


7- ఓం  సర్వబాధా  ప్రశమనం  త్రైలోక్య  స్యాఖిలేశ్వరీ !

     ఏవమేవ  త్వయాకార్యం అస్మద్వైరి  వినాశనం !!

          -: ఓం శాంతిః  శాంతిః  శాంతిః :-


మార్కండేయ పురాణంలో నున్న" చండీ సప్త శతి " 

(- దేవీ మహాత్యము) 700 ల మంత్రపూరిత శ్లోకాలలో  ఏడింటినీ  ఏర్చి కూర్చి (7) శక్తివంతమైన మంత్రాలతో సులభమైన సూక్ష్మమైన " మంత్రరాజం " ను 

మన ఋషులు తయారు చేశారు.


సర్వ శక్తి స్వరూపిణి , 

సకల దేవతా స్వరూపిణియైన 

ఆ దుర్గా పరమేశ్వరీ దేవి 

మధుకైటభ, 

మహిషాసుర, 

చండ-ముండ, 

ధూమ్రాక్ష, 

రక్తబీజ, 

శుంబ-నిశుంబాది

రాక్షసులను సంహారం చేసింది.


అందరూ దేవతలు కలసి అమ్మను వేడుకున్నారు. అమ్మా !..ధర్మానికి  హాని తలపెట్టే ఆసురీ శక్తులను నాశనం చేసి దైవిక  శక్తులకు తోడుగా వుండమ్మా!

అని దుర్గా సప్త శతి లో పై మంత్రములతో వేడుకున్నారు!!

ఓం దుం దుర్గాయై నమః..!!


 🌷శ్రీ మాత్రే నమః🌷

కామెంట్‌లు లేవు: