24, అక్టోబర్ 2020, శనివారం

ప్రాచీన సంస్కృతులను

 క్రిస్టియానిటీ పాశ్చాత్య దేశాల్లో గల రక రకాల ప్రాచీన సంస్కృతులను ఎలా ధ్వంసం చేసి నామరూపాలు లేకుండా చేసిందో "కాథరిన్ నిక్సే" అనే ఒక జర్నలిస్టుగా మారిన క్లాసిక్ టీచర్ మరియు రచయిత 

" చీకటి యుగం " (క్రిస్టియానిటీ చేతిలో ధ్వంసం అయిన ప్రాచీన ప్రపంచం)  అన్న తన పుస్తకం లో వివరించారు. (THE DARKENING AGE

The Christian Destruction of the Classical World

By Catherine Nixey)


ఆ పుస్తకంలో కొన్ని వివరాలు :


1600 సం.ల.క్రిందట ఆధునిక సిరియాలో ఉన్న పామిరా అభయారణ్యం లోని ఎథీనా యొక్క అందమైన విగ్రహానిని నల్లని దుస్తులు ధరించిన నమ్మకస్తులు ఇనుపరాడ్ లతో వెళ్లిన సంఘటన వివరిస్తూ ఆమె ఈ పుస్తకాన్ని ప్రారంభించింది. అంతియోకియలోని (పురాతన సిరియాలో) మేధావులను హింసించి శిరచ్ఛేదనం చేయడం అక్కడ ఉన్న వారి పవిత్ర విగ్రహాలు ధ్వంసం గురించి కూడా రాశారు. 


క్రిస్టియానిటీ చేతిలో ప్రాచీన ప్రపంచం ధ్వంసం ఎప్పుడు మొదలైందో చెప్పాలి అంటే ఏథెన్స్ లోని పార్థినాన్ (కన్య దేవతా ఆలయంగా పిలుస్తారు) ఆలయాన్ని ధ్వంసం చేయడం ద్వారా అని అంటారు.  లార్డ్ ఎల్గిన్ 1801-5లో “ఎల్గిన్ మార్బుల్స్” ను స్వాధీనం చేసుకున్న సంఘటన ఈ విషయం లో ఒక గొప్ప మలుపుతిప్పిన సంఘటనగా చెప్తారు . కానీ చరిత్రలో అది మొదటి ఉదాహరణ కాదు. బైజాంటైన్ యుగంలో, ఈ ఆలయాన్ని చర్చిగా మార్చినప్పుడు, ఇద్దరు బిషప్‌లు - మారినోస్ మరియు థియోడోసియోస్ -  పేర్లను దాని ప్రాచీన స్మారక స్తంభాలపై చెక్కించుకున్నారు. ఒట్టోమన్లు ​​పార్థినోన్‌ దేవాలయాన్ని ఒక గన్‌పౌడర్ నిల్వ కేంద్రంగా ఉపయోగించారు.  

17 వ శతాబ్దంలో వెనీషియన్ దళాలు దాడి చేసిన ఫలితంగా అక్కడ దెబ్బతిన్న ముఖాలు గల శిల్పాలు దర్శనం ఇస్తాయి.


పార్థినోన్ ఆలయం యొక్క శిల్పాలపై ముఖాలు, చేతులు మరియు జననేంద్రియాల వంటి భాగలపై జరిగిన దాడులను ఋజువులు గా చూపిస్తూ రచయిత్రి నిక్సే అనేక విషయాలను ఈ పుస్తకంలో విపులంగా తెలియచేసారు. 

"నీ పొరుగువారిని ప్రేమించు, నేర్చుకున్న విషయాలను కాపాడటం, సున్నితమైన కళలను రక్షించడం మరియు ఒక నీతి నియమాలకు కట్టుబడి ఉండటం మొ. ఉన్నత విలువలు కోసం క్రైస్తవ సంస్కృతిని స్వీకరించాము. కానీ వాస్తవానికి "ప్రారంభ చర్చి"  (అంటే మొదట్లో క్రైస్తవ సంస్కృతి) మేధో వ్యతిరేకత, ఐకానోక్లాజమ్ అంటే విగ్రహ ధ్వంస విధానం మరియు ఇతర మతస్థులపై విపరీత పక్షపాతం కలిగిఉండేది అని ఆమె తన పుస్తకం లో పేర్కొంది.


నిక్సే వాస్తవానికి మాజీ క్రైస్తవ సన్యాసిని కుమార్తె. అంతేకాక ఆమె తండ్రి మాజీ సన్యాసి కూడా.  ఆమె తన బాల్యంలో నమ్మకస్తురాలు అయిన కాథలిక్.  పాగన్ సంస్కృతులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ అద్భుత క్రైస్తవ సంస్కృతికి గౌరవం ఇచ్చేది.  కానీ క్లాసిక్ విద్యార్ధిగా ఆమె నిజాలను తెలుసుకున్నాక

 ధైర్యంగా తాను విద్యార్థిగా తెలుసుకున్న విషయాలను ఆమె తన పుస్తకంలో మొహమాటం లేకుండా స్పృజించింది. అందుకే ఈ పుస్తకం ఒక వివాదాస్పదమైన గంభీర రచనగా గుర్తింపు తెచ్చుకుంది.


ఈ పుస్తకంలో నిక్సే వ్రాసిన ప్రతి వాక్యం  ఉద్వేగభరితమైన అనుభూతి కలది. క్రైస్తవ సన్యాసులు  ఒట్టి చేతి సంజ్ఞలతో అన్యమత గ్రంథాలను గ్రంథాలయ దుకాణాల నుండి పిలిపించేవారని, ఆ గ్రంధాల ధ్వంసం గురించి ఇంకా అలెగ్జాండ్రియాలోని సెరాపిస్ యొక్క అసాధారణమైన, అత్యంత విలువైన భారీ ఆలయం యొక్క నాశనం గురించి రచయిత్రి సానుభూతి వాక్యాలతో ఈ పుస్తకంలో వివరించారు.  ఆ ఆలయం యొక్క  లైబ్రరీ నుండి వేలాది పుస్తకాలు అదృశ్యమయ్యాయి,  దేవాలయం యొక్క అందమైన చెక్క విగ్రహం తొలగించబడి దహనం చేయబడింది . ఒక అన్యమత ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం యునాపియస్ ఆలయం నుండి ధ్వంసం చేయబడని పురాతన నిధి దాని నేల మాత్రమే అని వ్యంగంగా వ్యాఖ్యానించాడు అంటే వారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి ఉంటారో తెలుస్తుంది.


పాపం నుండి తప్పించబడడానికి సిద్ధంగా ఉన్నాం అని నమ్మిన ఉన్మాదం రెచ్చగొట్టబడిన తక్కువ వయస్సు గల యువకుల పౌర సైన్యం బిషప్లకు ఉండేది. వారిచే అలెగ్జాండ్రియన్ అనే గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు మరియు అన్యమత తత్వవేత్త అయిన హైపాటియాను దుర్మార్గంగా సజీవంగా చంపించారు.  కాస్టిక్ సున్నం సోడా మరియు వెనిగర్ ఉపయోగించి ఒక రకమైన రసాయన ఆయుధాన్ని వారు తమ నమ్మకాలను పంచుకోని పూజారులపై యాసిడ్ దాడులుకు ఉపయోగించేవారు.


తాత్వికమైన చర్చ శారీరకంగా మనల్ని మనుషులుగా చేస్తుంది.  క్రొత్త ఆలోచనలను పంచుకోవడం ద్వారా పూర్వీకులు అణువును గుర్తించారు, భూమి యొక్క చుట్టుకొలతను కొలిచారు, శాఖాహారం యొక్క పర్యావరణ ప్రయోజనాలను గ్రహించారు.  కానీ వారి మతపరమైన ఏకాభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడిన అన్యమత తత్వవేత్తలు వీరి హింసకు బలి అయ్యారు,  సోక్రటీస్ ని మనం మర్చిపోకూడదు ఆయనపై మతపరమైన ఆరోపణలతో మరణశిక్ష విధించబడింది అని ఆమె పేర్కొన్నారు.


 క్రైస్తవులు పిడివాదా ప్రచారానికి కారణమయ్యారు. A.D. 386 లో ఎవరైనా “మతం గురించి వాదించేవారు… వారి జీవితాలతో, రక్తంతో మూల్యం చెల్లించాలి” అని ప్రకటించిన చట్టం ఆమోదించబడింది. ప్రాచీన పుస్తకాలు ఒక క్రమపద్ధతిలో కాలిపోయాయి. 

 క్రైస్తవ మతం యొక్క విజయం మరొకరిని భయపెట్టి లొంగదీసుకోవడంలో ఉంది అని ఈమె రాశారు.


A.D. 529 ఎథీనా ఒక జ్ఞాన  దేవత  పేరు గల ఆ నగరంలోనే ఎథీనా విగ్రహం యొక్క తల నరకబడిన మరొక  సంఘటన వివరిస్తూ నిక్సే తన పుస్తకాన్ని ముగుస్తుంది. పవిత్రంగా భావించబడిన ఆమె విగ్రహ అవశేషాలు  ఒకప్పటి ప్రపంచ ప్రఖ్యాత తత్వశాస్త్ర పాఠశాల భవంతికి  మెట్లుగా ఉపయోగించబడ్డాయి. 


ఈ పుస్తకం చదువుతూ ఉంటే మన ప్రాచీన భారతంలో వేల కొద్దీ మన దేవాలయాలపై మొఘలుల దాడులు, అలాగే గోవా ఇంక్విజషన్ సమయంలో వందల కొద్దీ హిందూ దేవాలయాలపై చర్చ్ దాడుల సంఘటనలు గుర్తుకు వస్తాయి, వాటి మూలాలు ఎక్కడ నుండి వచ్చి ఉండవచ్చో మనకు అవగాహన కలుగుతుంది.

కామెంట్‌లు లేవు: