24, అక్టోబర్ 2020, శనివారం

అమ్మవారి లీలలు*

 అమ్మవారి లీలలు*🙏


ఈ అనంత విశ్వంలో సృష్థి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే పంచకృత్యాలను నిర్వహించడం కోసం ఆ లలితా పరాభట్టారిక దేవీ వెలిసింది. అందుకే ఆమె పంచకృత్య పరాయణా అని కీర్తింపబడినది. 


అపార కరుణామూర్తి ఆ లలితాదేవి. ఆమె లీలలు అనంతాలు. 


లీల అంటే భగవత్ చేష్టితములు. 


మనముచేసే వాటిని కర్మలు అంటాము. 


లలితాదేవి తనను త్రికరణ శుద్ధిగా శరణు వేడిన వారిని కాపాడుట ఆతల్లి నైజము.


 ఆమె లీలలు అనంతాలు.

 

పూర్వం దక్షిణ భారతదేశంలో శరభోజి మహారాజు రాజ్యంలో అభిరామి అనే కవి, దేవతా ఉపాసకుడు ఉండేవాడు.


 ఆయన ఎప్పుడు అమ్మవారి ఆలయం లో ధ్యానం లో ఉండేవాడు. 


ఒకమారు ఆలయ దర్శనానికి మహారాజు రాగా అభిరామి అందరితోపాటు లేచి మహారాజుకు వందనం చేయలేదు. 


అప్పుడు రాజు అతని గురించి అడుగగా అక్కడి వారు అతనొక మతిలేనివాడని చెప్పిరి. 


కానీ రాజుకు నమ్మకం కుదరక తట్టిలేపి ఈరోజు తిధి ఏమిటని అడుగగా పౌర్ణమి అని బదులు పలుకుతాడు 


కానీ వాస్తవానికి ఆ రోజు అమావాస్య. రాజు లేపే సమయానికి అభిరామి అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం చేస్తున్నాడు. అమ్మ వారి ముఖమండలం పౌర్ణమి నాటి చంద్రబింబం వలే గోచరించింది. దాంతో ఆవిధంగా పలికేడు.


 అప్పుడు శరభోజి మహారాజు నాకు ఆకాశంలో పౌర్ణమి చంద్రబింబం చూపమని కోరగా. సాయంసంధ్యా వేళ చూపెదనని పలుకుతాడు. 


సూర్యాస్తమయ సమయానికి మహారాజు రాగా అభిరామి అమ్మవారి ధ్యానం లో కి వెళ్లి అమ్మను ధ్యానించగా ఆమె తన భక్తుని మాట నిజం చేయడం కొరకు తన చెవి కుండలం తీసి ఆకాశంలోకి విసరగా అది పూర్ణచంద్రబింబం గా మహారాజుకు గోచరించింది.


 అప్పుడు శరభోజి మహారాజు తన తప్పును తెలుసుకొని అభిరామిని క్షమాపణ కోరుతాడు. 


ఇలా తన లీలలను ఎన్నో చూపి తనభక్తులను కాపాడుకుంటుంది లలితఅమ్మవారు.


 *శ్రీమాత్రే నమః* 🙏

కామెంట్‌లు లేవు: