తెలుగుతల్లి పూదోట
తెలుగుతల్లి పూదోటలో - విరిసిన కుసుమాలెన్నో
నిరంతరం వెదజల్లిన - పరిమళపు సొగసులెన్నో!
ఖండాంతరాలు పాకిన - కీర్తి కెరటాలెన్నో
దశ దిశలలో వెలువడిన - ఘన చరితలెన్నో!
నన్నయ్య తిక్కన ఎర్రనల - భారతంపు భాగ్యసిరులెన్నో
శ్రీనాధ పోతన్నలు - కురిపించిన వెలుగులెన్నో!
శ్రీకృష్ణ దేవరాయల - భువన విజయంపు జిలుగులెన్నో!
అష్ట దిగ్గజంబులు - ఒలికించిన తెలుగు ధారలెన్నో!
అల్లసాని పెద్దన్న - అల్లిన అష్టాదష వర్ణనలెన్నో
ప్రాచీన ఆధునిక - సాహిత్యపు తెలుగు సొబగులెన్నో
కృష్ణశాస్త్రి కవితల్లో _ వెల్లివిరిసిన భావపరిమళమెంతో!
విశ్వనాధ వేయిపడగల్లో _ విచ్చుకొన్న మధురమెంతో
కరుణశ్రీ పుష్పవిలాపంబుతో_ శోకించె అంతరంగంబు
సినారె కావ్యబాటలో _ దొర్లిన పగడంపు రాసులెన్నో!
దాశరథి ,కాళోజీలు పరచిన _ పొత్తముల వెలుగులెన్నో!
అన్నమయ్య,క్షేత్రయ్యల _ గళాన జారిన భక్తి రసాలెన్నో!
శ్రీశ్రీ ,తిలక్ ల కలాల్లో_ జారిన అమృతంపు గుళికలెన్నో!
ఆ బ్రౌను సైతంబు _ చేసేను సేవ యెంతో!
ఎన్నెన్నొ రూపాల్లో _ ఒదిగింది కమ్మనైన మన తెలుగు !
ఎంత వర్ణించినా _ ఇంకెంతో మిగులును
అదే మన తెలుగు వెలుగు_ తరతరాల తరగని నిధి!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి