.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని మరొక పద్య రత్నం;
మ||
తిరమౌ భారతభూమిలో గలుగు జ్యోతిర్లింగముల్ ద్వాదశం
బరయంగా నణుశక్తి కేంద్రములె పో- అవ్వాని సద్భక్తిమై
పరిశీలించి ప్రయోగముల్ సలిపినన్ పండించు సౌభాగ్యముల్
చిరుచూపుంగమిఁ జూచినన్ ప్రళయమౌ శ్రీ సిద్దలింగేశ్వరా !
భావం;
సుస్థిరమైన భారతావనిలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు, పన్నెండు అణుశక్తి కేంద్రాలుగా దేశంలో వెలుగొందుతున్నాయి.
వాటికి భక్తి శ్రద్ధలతో పూజలు సల్పుతూ పరిశీలించి ఉపయోగించుకుంటే శాంతి సౌభాగ్యా లు పరిఢవిల్లుతాయు.
అలాకాకుండా,
వాటికి సముచితరీతిలో గౌరవాన్ని ఇవ్వక చిన్నచూపు చూసి వాటి పవిత్రతకు భంగం కలిగిస్తే మాత్రం ప్రళయం వాటిల్లుతుంది.
కదా శ్రీ సిద్ధ లింగేశ్వరా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి