24, అక్టోబర్ 2020, శనివారం

మహాగౌరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

🕉️🕉️ *మహాగౌరి*  🕉️🕉️

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


 *శరన్నవరాత్రులలోశోభాయమానంగా జగజ్జనని ఎనిమిదవ రోజు మహాగౌరి గా దర్శనమిస్తారు*


🕉️🕉️🕉️🛐🕉️🕉️🕉️


 *అష్టవర్షా భవేద్గౌరీ మహాగౌరీ... మహాగౌరి అష్టవర్ష ప్రాయము గలది... ఈమె గౌరవర్ణ శోభలు మల్లెపూవులను ,శంఖమును ,చంద్రుని తలపింపచేయును... ఈమె ధరించు వస్త్రములును ఆభరణములును ధవళకాంతులను వెదజల్లుచుండును...ఈమె చతుర్భుజ ...వృషభవాహన ...తన కుడి చేతులలో ఒకదాని యందు అభయముద్రను , మరియొక దానియందు త్రిశూలాన్ని ధరించి ఉండును...అట్లే ఎడమచేతులలో ఒకదాని యందు డమరుకమును వేరొకదానియందు  వరముద్రను కలిగి ఉంటుంది...*


 *పార్వతి అవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కెను... ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేతవర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచూ "" మహాగౌరి "" అని వాసిగాంచెను... ఈమె శక్తి అమోఘం...సద్యఃఫలదాయకము... ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును...వారి పూర్వ సంచిత  పాపములన్నియు పూర్తిగా నశించును... భవిష్యత్తులో కూడా పాపతాపములుగాని ,దైన్య దుఖఃములుగాని వారి  దరిచేరవు...వారు సర్వ విధముల పునీతులై అక్షయముగా పుణ్యఫలములను పొందుదురు... ఈ దేవి పాదారవిందములను సేవించుట వలన కష్టములన్నియు మటుమాయమై అష్టైశ్వర్యాలతో విరాజిల్లెదరు...అసంభవములైన పనులన్నీ సంభవమగును...ఆ తల్లి దయాకరుణవీక్షణాలు అందరిపై ప్రసరించుగాక...!!!*


 *లోకా సమస్తా సుఖినోభవంతు..* 

 *ఓం శాంతి శాంతి శాంతి* 


🕉️🛐🕉️🛐🕉️🛐🕉️

కామెంట్‌లు లేవు: