ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజు ఈరోజున అమ్మవారు సౌమ్య రూపంలో మహిషాసుర మర్ధిని గా దర్శనం ఇస్తారు.
అమ్మవారి విశేషాలు కొద్దిగా మీకోసం
మహిషాసురమర్దిని అమ్మవారి గురించి అందరికీ తెలుసు. ఆది శంకరులు హృద్యంగా లయబద్ధంగా రచించిన మహిషాసుర మర్దినీ స్తోత్రం కూడా స్బాగా ప్రచారంలో ఉన్నదే. ఈ రోజున మహిషాసుర మర్దిని పూజ చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. దీనిని మహిషఘ్నీ పూజ అని కూడా అంటారు. మహిషఘ్నీ అంటే మహిషాసురుణ్ని అంతం చేసిన దేవి అని అర్థం. అయితే మహిషాసురుని గురించి విస్తార ప్రస్తావన, కొన్ని విశేషాలు ఉన్నాయి. అవి తెలుసుకుందాం.. మహిషాసురుడు, రాక్షసులకు ఒకప్పుడు రాజైన రంభాసురుని కుమారుడు. రంభాసురుడు కామరూపంతో దున్నపోతు రూపంలో తిరుగుతూ ఒక అందమైన ఆడ దున్న రూపానికి ముగ్ధుడై ఆమెను వివామ మాడాడు. వారికి సగం మనిషి, సగం దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు జన్మించాడు. స్వాభావికంగా అసురులకు, దేవతలకు మధ్య వైరం ఉంది. ఎందరో అసురులు వర బల గర్వంతో స్వర్గాన్ని జయించడం, తర్వాత విష్ణువు, శివుడు వేర్వేరు అవతారాలు ధరించి వారిని నిర్జించడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలని నిర్ణయించాడు.
అందువల్ల బ్రహ్మను గూర్చి తపస్సు చేసి అందరు రాక్షసుల మాదిరిగానే చావు లేకుండా వరమిమ్మని అడిగాడు. అది కుదరదని చెప్పడంతో మహిళలు అబలలు కనుక వారు తనను ఎలానూ సంహరించలేరు కనుక వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరమిమ్మని కోరాడు. అందుకు బ్రహ్మ అంగీక రిం చి, వరమిచ్చాడు. మహిషాసురుడు ఆ వరబల గర్వంతో పేట్రేగిపోయాడు. తనను ఓడించే మహిళ ఉండదని విర్రవీగుతూ, దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించాడు. దానితో దేవతలు తమను రక్షించమని త్రిమూర్తులను వేడు కున్నారు. వారు తమ ముగ్గురి శక్తులు కలబోసి ఒక మహిళను సృష్టించారు. ఆమే దుర్గాదేవి. ఆమె మహిషాసురుణ్ని మట్టుపెట్టింది.
అమ్మవారు దుర్గా దేవి రూపంలో అవతరించి మహిషాసురుణ్రి వధించి మహిషాసురమర్దిని అయింది. దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధిం చే భంగిమలో ఉన్న శిల్పాలు దేశంలో చాలా చోట్ల కనిపిస్తాయి. వీటిలో మహాబలిపురం, ఎల్లోరా గుహలు, హలిబెడులోని హొయసాలేశ్వర ఆలయం ద్వారం వద్ద ఉన్నవి ప్రసిద్ధి పొందిన శిల్పాల్లో కొన్ని. ఇంకా చాలా ఆలయాల్లో, గుహల్లో ఇటువంటి శిల్పాలు ఉన్నాయి.
మహిషాసుర మర్దిని ప్రస్తావన హిందూ మతంలో ప్రముఖంగానే ఉన్నా అది బౌద్ధ శిల్ప కళలో కూడా విస్తారంగా కనిపించడం విశేషం. హిమాచల్ ప్రదేశ్‌లోని చాంబాలోగల లక్షణా దేవి ఆలయంలొ ఈ శిల్పాలు ఉన్నాయి. హట్ కోటిలో వాజేశ్వరీ దేవి చేతిలో ఒక రాక్షసుడు హతమవుతున్నట్టు శిల్పాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని గజ్ని సమీపంలో ఉన్న తప సర్దార్‌లోని పరిరక్ష ణాలయంలో ఉన్న శిల్పాలలోనూ, మధ్య టిబెట్‌లో కొన్ని చోట్ల దుర్గాదేవి, మహిషాసురుణ్ని హతం చేస్తున్న శిల్పాలు కనిపిస్తాయి.
జైన మతంలో కూడా దుర్గాదేవి, మహిషాసురుల ప్రస్తావన కనబడడం మరింత విశేషం. జోధ్‌పూర్ మ్యూజియంలోనూ, జునాగఢ్‌లోని సచికా దేవి ఆలయాలలోనూ, దేవగఢ్‌లోని సిద్ధ్‌కి గుఫాలోనూ ఇటువంటి శిల్పాలు కనిపిస్తాయి. దుర్గాదేవి, మహాషాసురుల మధ్య యుద్ధం ఈ శిల్పాల్లో కనిపిస్తుంది.
దసరాల్లో దుర్గాష్ఠమి రోజున దుర్గాదేవిని మహిషాసురమర్దిని రూపంలో పూజిస్తారు. పశ్చిమ బెెంగాల్ల్లో మహిషాసురుణ్ని చంపుతున్న దుర్గాదేవి విగ్రహా లకు పూజ చేస్తారు. ఇక కర్నాటకలోని మైసూరుకు ఆ పేరు మహిషాసురమర్దిని నుంచే వచ్చిందని చెబుతారు. దక్షిణాదిలో ఒక ప్రాంతం నుంచి భూమిని ఆక్రమించుకుంటూ వస్తున్న మహిషాసురుణ్ని చూసి మైసూర్ ప్రాంత ప్రజలు దుర్గాదేవిని శరణు వేడారని, వారిని కాపాడి అసురుణ్ని దేవి నిర్జించిందని చెబుతారు. మైసూరుకు దగ్గరలోని చాముండీ హిల్స్ ప్రాంతంలో 9 రోజుల యుద్ధానంతరం మహిషాసురుడు నిహతుడయ్యాడని పురాణ కథ. దసరా పండగను కన్నడంలో నడ హబ్బా అంటారు. రాష్ట్ట్ర పండగ అని దీని అర్థం. అందుకే ఈ పండగకు మైసూరు దసరా అనే పేరు కూడా ఉంది.
మైసూరు నగర పరిరక్షకురాలైన చాముండా దేవి ఆలయం వ ద్ద్ద మహిషా సురుని పెద్ద విగ్రహం ఉండడం చూడవచ్చు. మైసూరు ప్రస్తావన చరిత్రలో క్రీస్తు పూర్వం 245 నాటి నుంచే ఉన్నట్టు భావిస్తారు. ఇది సుమారుగా అశోక చక్రవర్తి కాలం. ఆ కాలం లో బౌద్ధ మతం ప్రబలంగా ఉండేది. అప్పుడు జరిగిన మూడవ బౌద్ధ స్నాతకోత్సవం ముగింపు సందర్భంగా ఆయన మహిష మండలానికి ఒక బృందాన్ని పంపారని అంటారు.
మహిష మండలం అంటే మహిషాసురుడు ఆక్రమించిన ప్రదేశం. మహిషా సురునికి మహిషి అనే సోదరి ఉందని కేరళలో ఒక కథ ప్రచారం లో ఉంది. మహిషాసురుని వధ అనంతరం ఆమె దేవతలతో తన యుద్ధం కొనసాగించేదని ఆ కథలో ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి