24, అక్టోబర్ 2020, శనివారం

నిమ్మకాయతో పులిహోర

 రేపు  ఆదివారం దుర్గా నవమి మరియు దశమి. 


అమ్మ వారి నివేదనకు.


నిమ్మకాయతో  పులిహోర.


కావలసినవి .


బియ్యము  --  ఒక  గ్లాసున్నర

నిమ్మకాయలు  --  నాలుగు

పసుపు  --   స్పూను

ఉప్పు  ---  తగినంత 

కరివేపాకు  ---  ఆరు రెమ్మలు

పచ్చిమిరపకాయలు  --  8

వేరు శనగ  గుళ్ళు  ---  పావు కప్పు 

నూనె  ---  100  గ్రాములు  


పోపు  సామగ్రి .


ఎండుమిరపకాయలు   ---  6

పచ్చి శనగపప్పు  ---  మూడు  స్పూన్లు .

చాయమినపప్పు  --  రెండు స్పూన్లు 

ఆవాలు  ---  స్పూను 

జీలకర్ర   --  అర  స్పూను 

ఇంగువ  --   పావు స్పూను లో  సగం

జీడిపప్పు  -  15  పలుకులు


తయారీ  విధానము .


ముందుగా    నాలుగు  నిమ్మ కాయలు  కట్  చేసుకుని   చేదు  దిగకుండా  రసం  తీసుకుని  విడిగా  వేరే  కప్పు లో  ఉంచుకోవాలి .


పచ్చిమిరపకాయలు   నిలువుగా   చీలికలు గా  కట్ చేసుకోవాలి .


తయారీ  విధానము.


ఒక గిన్నెలో  బియ్యము  పోసుకుని  ఒకసారి  కడిగి అందులో సరిపడా  నీళ్ళు  పోసుకుని  స్టౌ మీద  పెట్టుకుని  అన్నాన్ని  పొడి పొడిగా  వండుకోవాలి.


ఆ విధంగా  ఉడికిన  అన్నాన్ని  ఒక  బేసిన్  లోకి  వంపుకుని  , అందులో  స్పూను  పసుపు ,  నాలుగు  స్పూన్లు   నూనె  ,  మూడు రెమ్మలు   కరివేపాకును    మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని , అన్నము  వేడిగా  ఉంటుంది  కనుక  , గరిటతో  ఉండలు  లేకుండా బాగా  కలుపుకోవాలి.


ఇప్పుడు  మళ్ళీ  స్టౌ వెలిగించి   బాండి  పెట్టి  మిగిలిన   నూనె  వేసి  వరుసగా  ఎండుమిరపకాయలు  (  తుంపకుండా  ) ,  పచ్చి శనగపప్పు ,  చాయమినపప్పు ,

వేరుశనగ   గుళ్ళు  ,  ఆవాలు ,పచ్చి మిర్చి ,

మిగిలిన  కరివేపాకు  ,  జీడిపప్పు  మరియు ఇంగువను  వేసి  పోపు  బాగా  వేగ నివ్వాలి .


పోపు  వేగిన  వెంటనే ,  ముందుగా  సిద్ధం  గా  చేసుకున్న  నిమ్మ రసం , పోపు  కూడా  వేసి  గరిటతో  బాగా  కలుపుకోవాలి .

అంతే  ఘుమ  ఘుమ లాడే  నిమ్మ కాయలతో  పులిహోర  అమ్మవారి  నివేదనకు   సిద్ధం .

కామెంట్‌లు లేవు: