24, అక్టోబర్ 2020, శనివారం

శారదా మాత

VN Sastry: (7)ఆదిత్యేన్దుకృశానురూపనయనాం లోకైకరక్షాకరీం,

త్రైగుణ్యాత్మకరూపిణీమభయదాం త్రైలోక్యసంచారిణీమ్|

యోగధ్యానసమాధిభిర్విచలితాం మోక్షైకమార్గప్రదాం,

వన్దే శారదమాతరం శ్రుతినుతాం సర్వార్థసంపూరణీమ్ ||

భావం-సూర్యుడు, చంద్రుడు, అగ్నిదేవుడు నేత్రములుగా కలిగినటువంటి, లోకములను రక్షించేటటువంటి, త్రిగుణస్వరూపిఅయినటువంటి, అభయమిచ్చేటటువంటి, త్రైలోక్యసంచారిణి అయినటువంటి, యోగధ్యానసమాధులచేత ప్రసన్నమయ్యేటటువంటి, మోక్షమార్గమును ప్రసాదించేటటువంటి, సర్వార్థములను సిద్ధింపజేసేటటువంటి, వేదవినుత అయినటువంటి, శారదా మాతను నమస్కరించుచున్నాను.

(8)సౌభాగ్యామృతదాయినీం శివసతీం సౌభాగ్యసంసేవితాం,

నిత్యానన్దకరీం సదా ప్రియకరీం శ్రీచన్ద్రమౌలీశ్వరీమ్|

మాయారూపవిలాసినీం శుభకరీం మాణిక్యవీణాధరీం,

వన్దే శారదమాతరం శ్రుతినుతాం సర్వార్థసంపూరణీమ్ ||

భావం-సౌభాగ్యామృతమును ఇచ్చేటటువంటి, శివుని భార్య అయినటువంటి, సువాసినులచేత సేవింపబడేటటువంటి, నిత్యముఆనందమును కలిగించేటటువంటి, ప్రియమును కలిగించేటటువంటి, శ్రీచన్ద్రమౌళీశ్వరిఅయినటు, మాయారూపవిలాసినిఅయినటువంటి, శుభమును కలిగించేటటువంటి, మాణిక్యవీణను ధరించినటువంటి, సర్వార్థములను సిద్ధింపజేసేటటువంటి, వేదవినుత అయినటువంటి, శారదా మాతను నమస్కరించుచున్నాను.

(వృత్తమ్-శార్దూలవిక్రీడితమ్) 

*****ఫలశ్రుతి*****

శారదాంబాష్టకం పుణ్యం,

సర్వకాలే తు య: పఠేత్|

సర్వసిద్ధిం చ సంప్రాప్య,

సద్గతిం యాతి వై ధృవమ్||

భావం-పుణ్యప్రదమైన ఈశారదాంబాష్టకమును అన్నికాలములయందు ఎవడైతే చదివెదడో సర్వసిద్ధిని పొంది సద్గతిని పొందెదడు. ఇది నిశ్చయము. 

*అమ్మవారి కరుణాకటాక్షాలు మీఅందరిపై ఉండాలని, అష్టైశ్వర్యములతో, తులతూగాలని ఆఅమ్మవారిని ప్రార్థిస్తూ... ఇట్లు బుధజనవిధేయుడు.మీ కంచినాథం సూరిబాబు.K S. S. N. Murthy. P. G. T. S. K.T(retired) T. S. R. S. Medak.

కామెంట్‌లు లేవు: