24, అక్టోబర్ 2020, శనివారం

నవరాత్రులు


*దేవీ నవరాత్రులు**


 అమ్మవారి అలంకారం.


**శ్రీ మహిషాసురమర్దినీ దేవి**


**మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జననరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని**


దేవి తొమ్మిది అవవతారాలలో అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దినీ దేవి. ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్దినిగా అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమినే "మహర్నవమి"గా ఉత్సవం జరుపుకుంటారు. సింహ వాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశాలతో మహాశక్తి రూపంతో ఈ రోజు దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన అమ్మను మహిషాసురమర్దినీదేవిగా పూజిస్తే శత్రుభయం తొలగిపోయి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. చండీ సప్తశతీ హోమం చేయాలి. "ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యైస్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. కేసరి పూర్ణాలు నివేదన చేయాలి.


నైవేద్యం - కేసరి పూర్ణాలు,చక్కెర పొంగలి.


శ్రీ మహిషాసుర మర్ధని అష్టోత్తర శతనామావళి


ఓం మహత్యై నమః

ఓం చేతనాయై నమః

ఓం మాయాయై నమః

ఓం మహాగౌర్యై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం మహోదరాయై నమః

ఓం మహాబుద్ద్యై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం మహాబలాయై నమః

ఓం మహాసుధాయై నమః

ఓం మహానిద్రాయై నమః

ఓం మహాముద్రాయై నమః

ఓం మహోదయాయై నమః

ఓం మహాలక్ష్మ్యై నమః

ఓం మహాభోగ్యాయై నమః

ఓం మహామోహాయై నమః

ఓం మహాజయాయై నమః

ఓం మహాతుష్ట్యై నమః

ఓం మహాలజ్జాయై నమః

ఓం మహాదృత్యై నమః

ఓం మహాఘోరాయై నమః

ఓం మహాదంష్ట్రాయై నమః

ఓం మహాకాంత్యై నమః

ఓం మహా స్మృత్యై నమః

ఓం మహాపద్మాయై నమః

ఓం మహామేధాయై నమః

ఓం మహాభోదాయై నమః

ఓం మహాతపసే నమః

ఓం మహాస్థానాయై నమః

ఓం మహారావాయై నమః

ఓం మహారోషాయై నమః

ఓం మహాయుధాయై నమః

ఓం మహాభందనసంహర్త్ర్యై నమః

ఓం మహాభయవినాశిన్యై నమః

ఓం మహానేత్రాయై నమః

ఓం మహావక్త్రాయై నమః

ఓం మహావక్షసే నమః

ఓం మహాభుజాయై నమః

ఓం మహామహీరూహాయై నమః

ఓం పూర్ణాయై నమః

ఓం మహాచాయాయై నమః

ఓం మహానఘాయై నమః

ఓం మహాశాంత్యై నమః

ఓం మహాశ్వాసాయై నమః

ఓం మహాపర్వతనందిన్యై నమః

ఓం మహాబ్రహ్మమయ్యై నమః

ఓం మాత్రే / మహాసారాయై నమః

ఓం మహాసురఘ్న్యై నమః

ఓం మహత్యై నమః

ఓం పార్వత్యై నమః

ఓం చర్చితాయై నమః

ఓం శివాయై నమః

ఓం మహాక్షాంత్యై నమః

ఓం మహాభ్రాంత్యై నమః

ఓం మహామంత్రాయై నమః

ఓం మహామాకృత్యై నమః

ఓం మహాకులాయై నమః

ఓం మహాలోలాయై నమః

ఓం మహామాయాయై నమః

ఓం మహాఫలాయై నమః

ఓం మహానీలాయై నమః

ఓం మహాశీలాయై నమః

ఓం మహాబలాయై నమః

ఓం మహాకలాయై నమః

ఓం మహాచిత్రాయై నమః

ఓం మహాసేతవే నమః

ఓం మహాహేతవే నమః

ఓం యశస్విన్యై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం మహాస్త్యాయై నమః

ఓం మహాగత్యై నమః

ఓం మహాసుఖిన్యై నమః

ఓం మహాదుస్వప్ననాశిన్యై నమః

ఓం మహామోక్షకప్రదాయై నమః

ఓం మహాపక్షాయై నమః

ఓం మహాయశస్విన్యై నమః

ఓం మహాభద్రాయై నమః

ఓం మహావాణ్యై నమః

ఓం మహారోగవినాశిన్యై నమః

ఓం మహాధారాయై నమః

ఓం మహాకారాయై నమః

ఓం మహామార్యై నమః

ఓం ఖేచర్యై నమః

ఓం మహాక్షేమంకర్యై నమః

ఓం మహాక్షమాయై నమః

ఓం మహైశ్వర్యప్రదాయిన్యై నమః

ఓం మహావిషఘ్మ్యై నమః

ఓం విషదాయై నమః

ఓం మహాద్ర్గవినాశిన్యై నమః

ఓం మహావ్ర్షాయై నమః

ఓం మహాతత్త్వాయై నమః

ఓం మహాకైలాసవాసిన్యై నమః

ఓం మహాసుభద్రాయై నమః

ఓం సుభగాయై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం మహాసత్యై నమః

ఓం మహాప్రత్యంగిరాయై నమః

ఓం మహానిత్యాయై నమః

ఓం మహాప్రళయకారిణ్యై నమః

ఓం మహాశక్త్యై నమః

ఓం మహామత్యై నమః

ఓం మహామంగళకారిణ్యై నమః

ఓం మహాదేవ్యై నమః

ఓం మహాలక్ష్మ్యై నమః

ఓం మహామాత్రే నమః

ఓం మహాపుత్రాయై నమః

ఓం మహాసురవిమర్ధిన్యై నమః


🌹శ్రీ మాత్రే నమః🌹

🙏🙏🙏

**దశిక రాము**


 **దేవీ నవరాత్రులు - నవ దుర్గలు**

 

**సిద్ధిధాత్రి మాత** 


 శ్రీ రాజరాజేశ్వరీ దేవి 🌹


🌷. ప్రార్ధనా శ్లోకము :


**సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ**


🌷. అలంకారము :

శ్రీ రాజరాజేశ్వరీ దేవి- ఆకుపచ్చ రంగు


🌷. నివేదనం : పరమాన్నం, పిండివంటలు 


🌷. మహిమ - చరిత్ర :

తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.


🌻. సాధన :

దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…


1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.


సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.


నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.


ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.


నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.


దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.

🌹 🌹 🌹 

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: