24, అక్టోబర్ 2020, శనివారం

మైసూరు మహారాజా

 మైసూరు మహారాజా నలవాడి కృష్ణరాజ ఉడయారు.

---------------------


ఈయన్ని రాజర్షి అని పిలిచేవారు గాంధీ.


ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ పరిపాలన వ్యవస్థ కలిగిన రాష్ట్రం మైసూరని బ్రిటిష్ అధికారి లార్డ్ సాంకే మెచ్చుకున్నారు.


మన పురాణాల్లో ధర్మపాలన చేసే ప్రభువులుగా చెప్పుకునే రాజులకు సరితూగేవాడు మైసూరు రాజు అని పండిట్ మదనమోహన మాలవియ అనేవారు. 


అశోక చక్రవర్తి అంతటి గొప్పవాడు మైసూరు రాజు అని బ్రిటిష్ అధికారి లార్డ్ శామ్యూల్ పోల్చారు.


మైసూరు ప్రజలు తమ పూజ గదిలో ఈ రాజు చిత్రపటాలను పెట్టి దేవునిగా పూజిస్తున్నారు.


ఈయన హయాంలో మైసూరు, బెంగళూరు, మాండ్య, చిత్రదుర్గ, శివమెుగ్గ (పాతపేరు షిమోగా) మరియు తుంకూరు ప్రజలు స్వర్ణయుగాన్ని చూశారు.


కానీ మనం ఇతని గురించి ఎప్పుడూ వినలేదు. టిప్పు సుల్తాన్ అనే దుష్టపాలకుని పుట్టిరోజులు చేసిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గొప్పరాజును స్మరించడానికి కూడా  ఇష్టపడలేదు.


 కర్ణాటక ప్రజల చేత బలవంతంగా టిప్పు జయంతి వేడుకలు జరిపిస్తూ, ఉడయారు రాజు గురించి చరిత్ర పుస్తకాల్లో చేరిపేసి ప్రజలు మర్చిపోయేలా చేశారు కాంగ్రెస్ పాలకులు. 

కర్ణాటక లో ఉడయారు రాజు చేసిన పారిశ్రామికాభివృద్ధి, విద్యాభివృద్ధి, సామాజికాభివృద్ధి మొత్తాన్ని సిగ్గు లేకుండా చాచా నెహ్రు ఖాతాలో వేసేసి చిల్డ్రెన్స్ డే జరుపుకుంటున్నారు కాంగ్రెస్ వారు.


ఈ రోజు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆ సైన్స్, దేశంలోనే ప్రసిద్ధి గాంచిన న్యూరో సైన్స్ అండ్ సైకియాట్రి (NIMHANS), జయదేవ లాంటి ఆధునిక గుండె సంబంధిత ఇన్స్టిట్యూట్స్ బెంగళూరు లో ఉన్నాయంటే అందుకు కారణం మైసూరు మహారాజా వారు.


నిజాం తన బంగారు మంచం మీద స్త్రీలతో సుఖభోగాలు అనుభవిస్తూ, అప్పట్లో ప్రపంచంలోనే సంపన్న రాజుగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్న సమయంలోనే మన మైసూరు మహారాజా వారు తన వద్దనున్న బంగారాన్ని బొంబాయి మార్కెట్లో తాకట్టు పెట్టి కృష్ణరాజసాగరు ఆనకట్టను నిర్మించారు. ఇదీ ఆ రాజకుటుంబం యొక్క గొప్పతనం. ఇదీ మన హిందూరాజుల ఘన చరిత్ర.


ఈ మైసూరు మహారాజా వారు చేసిన పనుల్లో కొన్నిటి జాబితా చూడండి.


* 1902: శివనసముద్ర జలపాతం వద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏర్పాటు.(భారతదేశంలో నీటి ద్వారా విద్యుత్తు ఉత్పత్తి మొదటిసారిగా ఇక్కడే జరిగింది)

* 1903: బెంగళూరు మింటో కంటి ఆసుపత్రి నిర్మాణం. ప్రపంచంలో ఉన్న ప్రాచీన కంటి ఆసుపత్రుల్లో ఇదొకటి.

* 1905: దేశంలో మొదటిసారి విద్యుత్తుతో వీధి దీపాలు బెంగళూరు లో ఏర్పాటు. 


* 1907: చిత్రదుర్గలో వాణి విలాససాగర అనకట్ట నిర్మాణం పూర్తి. ఇది కర్ణాటక రాష్ట్రంలో మొట్టమొదటి ఆనకట్ట. మహరాణి తన నగలను కుదువపెట్టి నిర్మాణపనులకు ధనం వెచ్చించింది.


* 1907: మొదటిసారి ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టాలను అవగాహన చేసుకునే ఉద్దేశ్యంతో సామాన్య వ్యక్తులతో కూడిన మైసూరు ధర్మశాస్త్ర కమిటీ ఏర్పాటు.

* 1909: బెంగళూరు లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏర్పాటు.


* 1909: దేశంలో మొట్టమొదటిసారి మైసూర్ బోయ్ స్కౌట్స్ ఏర్పాటు.

* 1913: స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఏర్పాటు.

* 1913: బెంగళూరు లో మైసూర్ అగ్రికల్చర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు..దీన్ని మొదట 1899లో నాలుగవ కృష్ణరాజవడియారు తల్లిగారైన మహారాణి వాణి విలాస్ సన్నిధాన గారు 30 ఎకరాల్లో మేలుజాతి వ్యవసాయఉత్పత్తుల పరిశోధనశాలను ఏర్పాటు చేశారు.


* 1915: కన్నడ సాహిత్య పరిషత్తు ఏర్పాటు.

* 1915: సమాజంలో ఆర్ధికంగా బలహీనంగా ఉన్నవారి అభివృద్ధి కోసం మైసూరు సోషల్ ప్రోగ్రెస్ అసోషియేషన్ స్థాపన. 

* 1916: మైసూరు విశ్వవిద్యాలయ స్థాపన.

* 1916: బెంగళూరు ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ సంస్థ ఏర్పాటు.


* 1916: మైసూరు లో యువరాజా కళాశాల నిర్మాణం.

* 1917: బెంగళూరు లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నిర్మాణం.


* 1916-18 మధ్యలో మైసూరు రాష్ట్ర రైల్వే(MSR) ద్వారా 232 మైళ్ళ రైల్వే ట్రాక్ నిర్మాణం. 1938 కల్లా దాన్ని 740 మైళ్ళకు పెంపు.


* 1916: మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు

* 1916: బెంగళూరు లో ప్రభుత్వ శాండల్ ఉడ్ ఆయిల్ పరిశ్రమ ఏర్పాటు.

* 1917: మైసూర్ లో మహారాణి మహిళా సైన్స్ కాలేజ్ నిర్మాణం.

* 1918: భద్రావతిలో వుడ్ డిస్టిల్లషన్ పరిశ్రమ ఏర్పాటు.


* 1918: మైసూరు క్రోమ్ అండ్ ట్యానింగ్ పరిశ్రమ ఏర్పాటు.

* ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి 25% రిజేర్వేషన్స్ అమలు చెయ్యడానికి కమిటీ ఏర్పాటు.


* 1921: లలిత మహల్ ప్యాలెస్ నిర్మాణం.

* 1921: బెంగళూరు లో ప్రభుత్వ సైన్స్ కాలేజ్ నిర్మాణం.

* 1923: భద్రావతి లోని విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ (VISL) ను మైసూరు ఐరన్ వర్క్స్ గా మొదలు.

* 1923: మహిళకు ఓటుహక్కును కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం.


* 1924: కృష్ణ రాజసాగర్ ఆనకట్ట నిర్మాణం.

* 1924: మైసూరు వైద్య కళాశాల స్థాపన.

* తుఫాను, కావేరి నది నీటి ప్రవాహం వల్ల నష్టపోయిన ఎడతోరు పట్టణ ప్రజల కోసం 1925-30 మధ్యలో

కృష్ణ రాజనగర అనే పట్టణాన్ని నిర్మించి ఇచ్చారు.


* 1925: నేషనల్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (NIMHANS) కళాశాల కోసం 100 ఎకరాల భూమి దానం చేశారు

కామెంట్‌లు లేవు: