24, అక్టోబర్ 2020, శనివారం

సౌందర్య లహరి శ్లోకము - 52

 సౌందర్య లహరి

శ్లోకము - 52


(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

శ్రీ లలితాంబికాయైనమః)


                

ఈ శ్లోకము లో దేవి కన్నులు చెవుల వరకు సాగి, ఆకర్ణాంతమూకన్నులు చెవుల వరకు సాగి, ఆకర్ణాంతమూి కన్నులు చెవుల వరకు సాగి, ఆకర్ణాంతమూకన్నులు చెవుల వరకు సాగి, ఆకర్ణాంతమూ గబడిన మన్మథుడి బాణముల జంటవలె ఉన్నవని వర్ణన 

చేయబడింది. 


"గతే కర్ణాభ్యర్ణం _ గరుత ఇవ పక్ష్మాణి దధతీ

 పురాంభేత్తు శ్చిత్త ప్రశమరసవిద్రావణ ఫలే !

 ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తంస కలికే !

 తవా కర్ణాకృష్ట _ స్మరశరవిలాసం కలయతః !!


పర్వతాధిపుడయిన హిమవంతుని వంశానికి శిరోభూషణ మైన 

పువ్వు మొగ్గ వంటి పార్వతీ ! నీ కన్నులు చెవులనంటి యున్నవి . 

ఆ కన్నుల రెప్పల వెండ్రుకలు ,   బాణమునకు కట్టబడిన గ్రద్ద

ఈకల వలె ఉంటాయి. అవి పరమ శివుని మనస్సులో ని  శాంత

రసాన్ని పోగొట్టి శృంగార రసాన్ని ఉత్పన్నము చేయడమే ఫలముగా

కల్గి ఉంటాయి. అటువంటి నీ నేత్రములు, చెవుల వరకూ లాగబడిన 

మన్మథుని బాణముల సౌందర్యాన్ని తలపిస్తున్నాయి ( శివుని

మనస్సును కలతపెట్టే, గ్రద్ద ఈకలు కట్టి , ఆకర్ణాంతము లాగబడిన 

మన్మథుని బాణమువలె రెప్ప వెండ్రుకలతో చెవుల వరకు విస్తరించిన

దేవి నేత్రములు శోభిస్తున్నాయని భవము) ( దేవి కన్నులు శివుని

చిత్తమును కలత పెట్టు మన్మథబాణముల వలె ఉన్నాయనిభావము)


అమ్మా! పర్వత పుత్రీ ! చెవులదాకా వ్యాపించి ఉంటాయి నీ పెద్ద పెద్ద 

కళ్ళు. బలంగా లాగిన విల్లులవలె ఉంటాయి . నీ కనురెప్పలు ఒత్తుగా

హృద్యంగా వుంటాయి . ఇక నీ చూపులు ఆవిల్లుకే తొడిగిన రెక్కల

బాణాల్లా ఉంటాయి . చూడగా చూడగా త్రిపురారి అయిన ఈశ్వరుణ్ణి

చలింపజేయడం కోసం విసిరేందుకు మన్మథుడు తన వింటికి 

బిగించిన బాణాల్లా వుంటుంది తల్లీ _ నీ నేత్ర సౌందర్యం .


ఓం సర్వారుణాయైనమః

ఓం అనవద్యాంగ్యైనమః

ఓం సర్వాభరణభూషితాయైనమః


సౌందర్య లహరి

 శ్లోకము - 53


(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

(శ్రీ లలితాంబికాయైనమః)


                    


శ్రీదేవి నేత్రత్రయము ఎరుపు, తెలుపు, నలుపు రంగులు కలిగి బ్రహ్మ 

విష్ణు , రుద్రులను సృష్టించడానికై ఆమె సిద్ధపరచుకొన్న రజస్సత్త్వ తమో

గుణములా అన్నట్లున్నవి.


"విభక్త త్రైవర్ణం _ వ్యతికరిత లీలాం జనతయా

 విభాతి త్వన్నేత్ర _ త్రితయ మిద మీశాన దయితే !

 పున స్స్రష్టుం దేవాన్ _ ద్రుహిణ హరిద్రా నుపరతాన్

 రజ స్సత్త్వం బిభ్రత్తమ ఇతి గుణానాం త్రయమివ !!"


శివుని ప్రియురాలైన దేవీ ! ఓ పార్వతీ ! ఈ కన్పిస్తున్న ఈ నీ మూడు

కన్నులునూ , అర్ధ వలయాకారంగా విలాసము కొరకై తీర్చి దిద్ధి న 

కాటుక కలవై , విభజింప బడిన ఎరుపు, తెలుపు , నలుపు అనే మూడు

వర్ణములు కలవై యుండి , ప్రళయమునందు నీ యందు లీనమైన

బ్రహ్మ , విష్ణు , రుద్రులనే దేవతలను, తిరిగీ ఈ బ్రహ్మాండము నందు

సృష్టించడానికై  సత్వరజస్తమో గుణములనే మూడు గుణములనూ

ధరిస్తున్నావా అన్నట్లు ప్రకాశిస్తున్నాయి. 

 


అమ్మవారు కళ్ళకు కాటుక పెట్టుకుంటారు కదా ! అలా మూడు కన్నులకూ

 కాటుక అలదు కోవడం వలన  వాటియొక్క మూడు రంగులూ ఇప్పుడు 

మాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. (ఒక్కొక్క రంగూ గుణత్రయ విభాగం

లోని ఒక్కొక్క గుణాన్ని సూచిస్తోంది) నిర్గుణమైన ఆమె నేత్రాలలో

త్రిగుణస్ఫురణ చూస్తుంటే  _ బ్రహ్మను,  విష్ణువునూ, ఈశ్వరుణ్ణీ మళ్లీ 

ఆ తల్లి సృజించబోతున్నదా అనిపిస్తోంది .


ఓం శివకామేశ్వరాంకస్థాయైనమః

ఓం శివాయైనమః

ఓం స్వాధీనవల్లభాయైనమః


సౌందర్య లహరి

శ్లోకము - 54


(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

(శ్రీ లలితాంబికాయైనమః)


                     


ఈ శ్లోకము లో శ్రీదేవి యొక్క మూడు కన్నుల యొక్క పవిత్రత ను గూర్చి వివరించ బడింది


"పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే 

 దయామిత్రైర్నేత్రై రరుణ ధవళ శ్యామ రుచిభిః !

 నద శ్శోణో గంగా _ తపనతనయేతి ధ్రువ మ ముం

 త్రయాణాం తీర్థానాముపనయసి సంభేద మనఘం!!


పశుపతి యైన శివుని యందు లగ్నమైన చిత్తము 

కలదానా ! దేవీ దయారసముతో కూడిన ఎరుపు,

తెలుపు, నలుపు కాంతులు కలవైన నీ కన్నులచే

ఎర్రని జలప్రవాహముగల శోణ నదము, తెల్లని 

జల ప్రవాహము గల గంగ, నీల జలప్రవాహముగల 

యమున అనే మూడు నదుల సంగమ స్థానమును

మమ్ము లను పవిత్రులను గా చేయటానికై మాకు

సంపాదించి ఇస్తున్నావు. ఇది నిజము.


ఓం సుమేరుశృంగమధ్యస్థాయైనమః

ఓం శ్రీమన్నగరనాయికాయైనమః

ఓం చింతామణిగృహాంతస్థాయైనమః

కామెంట్‌లు లేవు: