24, అక్టోబర్ 2020, శనివారం

బందరు ప్రత్యేకం శక్తి పటం

 *🚩బందరు ప్రత్యేకం శక్తి పటం🚩*


శరన్నవరాత్రి ఉత్సవాల్లో పూజలతో కొందరు అమ్మ వారిని కొలుస్తారు. మరికొందరు శక్తి పటాలు ఎత్తుకుని మొక్కుబడులు తీర్చుకుంటారు దేశంలోనే కోల్ కతా తరువాత జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శక్తి పటాల ఊరేగింపు జరుగుతుంది అందుకే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. నల్లని దుస్తులతో  ఒక చేతిలో చురకత్తి రెండో చేతిలో 50 కిలోల బరువున్న ఆరడుగుల శక్తి పటాన్ని భుజానికెత్తుకుని నిర్వహించే ప్రదర్శన భక్తి భావాలను పెంపొందిస్తుంది ఒకవైపు ఆంజనేయస్వామి మరోవైపు కాళీమాత చిత్రాలను నయనమనోహ రంగా రూపొందించిన శక్తి పటం చూపరులను కనువిందు చేస్తుంది ఇలాంటి ప్రత్యేక ప్రక్రియ కోల్క కతా తరువాత ఒక మచిలీపట్నంలోని ప్రాధాన్యం.

దశాబ్దాల క్రితం మాజీ సైనికుడు దాదా కోల్ కతాలోని కాళీమాత చిత్రపటాన్ని ఈడేపల్లిలోని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టారు ఆయన ఇక్కడి సాంప్రదాయమైన శక్తిపటాల ప్రదర్శనను ఈ ప్రాంతానికి పరిచయం చేశారు పట్టణములోని శక్తిగుడి, గొడుగుపేట ఉమాగుడి శక్తి పటాలు పోటీపడి ప్రదర్శనలు నిర్వహిచేవి ప్రస్తుత పలు ప్రాంతాల నుండి భక్తులు శక్తిపీఠాలను ఎత్తుకుని భక్తిప్రపత్తులు చాటుకుంటారు రుద్ర భూమి తెల్లవారుజామున పూజలు చేసి శక్తి పటాన్ని ఎత్తుకునే  వ్యక్తి ఉపవాస దీక్ష స్వీకరిస్తారు మొహానికి కాళీమాత ముఖచిత్రాన్ని కారాళంగా ధరిస్తారు. దీనివల్ల శక్తి పటాన్ని ఎత్తుకునే వ్యక్తి ఊపిరి ఆడక పోయినా అలానే పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఊరేగుతూ తమ భక్తిని తెలియజేయడంతో శక్తి పటాల ప్రాధాన్యతను తెలియజేస్తారు పక్కన ఉన్న భక్తులు శక్తి పటాన్ని దర్శించిన వ్యక్తికి విసన కర్రలతో విసురుతూ సహాయ సహకారాలు అందిస్తారు ప్రదర్శనకు ముందు నడిచే కనక తప్పెట్ల విన్యాసం శబ్దాలకు అనుగుణంగా చిందు వేడుకల్లో కూడా శక్తి పట ధారి అనుభవం కలిగి ఉంటాడు దీనివల్ల ప్రదర్శనలో వైవిధ్యం భంగిమలను జనరంజకంగా ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలతో ఈ సందడి తగ్గింది. పట్టణములో శరన్నవరాత్రులు మొదలవగానే శక్తి పటాల ఊరేగింపు పండుగ శోభ కనబడడం లేదు. పట్టణంతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన వృత్తిరీత్యా పలు రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో స్థిరపడిన వారు కూడా తమ మొక్కుబడులు చెల్లించేందుకు కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చి శక్తి పటాలు కట్టుకుని మొక్కులు తీర్చుకుంటారు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: