జ్జానం
మన వేదాలు, వేదాల తరువాత ఉపనిషత్తులు. పురాణ ఇతిహాసాలు ఒక్కొక్క హిందూ గ్రంధం మనిషిని ఆధ్యాతిమిక వైపు దృష్టిని మళ్లించటానికి మాత్రమే. కానీ చివరి లక్ష్యం మాత్రం మోక్షం మాత్రమే. వేరే ఏ ఇతర మతాలలో కనీసం మాట వరుసకు కూడా లేని విచారణ మన హిందూ ధర్మంలో వున్న అతి ఉన్నతమైన, పవిత్రమైన భావన ఈ మోక్షం.
వేదాల తరువాత వచ్చినవి వేదాల చివరలో వున్నవి ఉపనిషత్తులు, అందుకే వేదాంతం అని అన్నారు. నిజానికి ఉపనిషత్తులు వేదాల కన్నా భిన్నమైనవి, ఎందుకంటె వేదాలు కర్మ కాండని తెలుపుతే ఉపనిషత్తులు జ్ఞానాన్ని అంటే జ్ఞాన కాండని తెలుపుతాయి. కర్మలు చేయటం వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి వేదాలు ఉపదేశిస్తే, ఉపనిషత్తులు యెట్లా తెలుసుకోవాలి, మనిషి తానె యెట్లా భగవంతుడు గా కావలి అని చెప్పేవి ఇవి.
ఉపనిషత్తులు చాలా వున్నాయ్ అని అన్నారు, కానీ అందులో 108 ప్రముఖంగా అంతకన్నా ప్రముఖంగా 10 ఉపనిషత్తులు అని పండితులు ప్రస్తావిస్తున్నారు. అన్ని ఉపనిషత్తులు మహా ఋషులతో జరిగిన సంవాదాలే. అంటే మహర్షులు వారి శిష్యులకు ఇచ్చిన జ్ఞాన సంపద మాత్రమే.
మనం ఒక విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఏ ఒక్క మహర్షి కూడా యెంత జ్ఞానాన్ని ప్రసాదించిన దానికి తాను కర్తనని ఎక్కడ పేర్కొనలేదు. తానూ మహాపురుషుల వద్ద నుండి విన్నది, తెలుసుకున్నది మీకు తెలియ చేస్తున్నాను అని నుడువుతారు. దీనిని బట్టి మన మహర్షులు యెంత నిస్వార్ధంగా ఇతరులకు జ్ఞాన బోధ చేసారో తెలుస్తున్నది. ఏ వక్కటి తన గొప్పతనం కాదని వారు నిరాడంబరులుగా వున్నారు. వారి ధ్యేయం కేవలం జ్ఞాన విస్తరణే కానీ తమకు ఖ్యాతి రావాలని ఏ మహర్షి కోరుకోలేదు.
ఈ రోజుల్లో ఏదో చిన్న విషయం తెలిసినా అది తన ప్రతిభ అని తనకన్నా గొప్పవాళ్ళు లేరనే విధంగా మనుషులు ప్రవర్తిస్తున్నట్లు మనం చుస్తువున్నాం.
ఉపనిషత్తులలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను సూక్షంగా చెప్పే వాక్యాలను మహావాక్యాలు అన్నారు. ఈ వాక్యాలు రెండు లేక మూడు పదాలతో ఉండి భగవత్ శక్తిని తెలియ చేస్తుంటాయి.
ఉదా : 1) అహం బ్రహ్మస్మి: రెండు పదాలతో వున్న ఈ మహా వాక్యం నేను బ్రహ్మను ఐ వున్నాను అని తెలుపుతుంది.
2) తత్ త్వమసి : ఈ మహావాక్యం కూడా చాల ప్రముఖంగా వినబడేది. దీని భావం నీవు వెతికే బ్రహ్మ పదార్ధం నీవే అయి వున్నావు అని చెపుతున్నది. ఈ విధంగా అనేక మహా వాక్యాలు చోటుచేసుకున్నాయి.
ఉపనిషత్తులు అన్ని కూడా అద్వైత జ్ఞానాన్ని మనకు తెలియ చేస్తున్నాయ్. అంటే దేముడు జీవుడు వేరు కాదు ఒకటే వివరంగా చెప్పాలంటే ఈ చరా చార సృష్టిని నియంత్రించే శక్తీ ఆయన భగవంతుడు జ్ఞానీ ఒకటే కానీ వేరు కాదు అనే మహోన్నత జ్ఞానం మనకు తెలుపు తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి