: 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 59*
***** శ్లో:- *గీతా సుగీతా కర్తవ్యా ౹*
*కి మన్యై: శాస్త్ర విస్తరై: ౹*
*యా స్వయం పద్మనాభస్య ౹*
*ముఖపద్మాత్ విని: సృతా ౹౹*
*****
*భా:- భారతీయ తత్త్వ శాస్త్ర గ్రంథాలన్నింటిలో భగవద్గీత ప్రామాణికము. సకల వేద సారము. జగద్గురువైన శ్రీకృష్ణపరమాత్మ ముఖకమలము నుండి జాలువారిన దివ్యవాణి. అమృతవాణి.సూనృతవాణి.ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా చదువవలసిన గ్రంథరాజము. దేశవిదేశాలలో నేటికి భక్తులకు నిరంతర పారాయణ; విద్యార్థులకు అవశ్య పఠనీయ పాఠ్యపుస్తకముగా ఆదరింపబడుతున్నది గీతయే. ఇందలి భాష సరళము. భావము సుందరము. ఇది అల్పాక్షరము. అనల్పార్థము. నిగూడార్థనిథి. మానవ జీవిత సమస్యలన్నింటికి పరిష్కారదర్శిని గీత. చెకుముకిరాయి నూరేండ్లు నీటిలో నానినా, మరల రాతి రాపిడితో నిప్పును జ్వలింపజేసినట్లే, గీతాధ్యాయి ఐన మనిషి సంసారమనే లోతైన బురదలో కూరుకుపోయినా, తిరిగి సత్సంగతిచే పున రుత్తేజితుడౌన్నాడు. సహజగుణం కోల్పోడు. గీతా మహిమ అపారము. అపరిమితము. ప్రపంచ చరిత్రలో "నీవు నన్ను ఆశ్రయిస్తే నేను నీ యోగక్షేమాలు వహిస్తాను" అని రూపించి. నిరూపణ చేసిన ఉదాత్త గ్రంథం భగవద్గీతే. కాన ఆబాలగోపాలం గీతను చదువుతూ, జన్మను ధన్యం చేసుకోవాలని సారాంశము. యోగీశ్వరుడు "కృష్ణుడు", ధనుర్ధారి "అర్జునుడు" ఎక్కడ ఉంటే అక్కడ జయము, విజయము,దిగ్విజయము తథ్యమే. శ్రీరస్తు. శుభమస్తు*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
: *ధార్మికగీత - 39*
*****
*శ్లో:- కృషితో నాస్తి దుర్భిక్షం ౹*
*జపతో నాస్తి పాతకః ౹*
*మౌనేన కలహో నాస్తి ౹*
*నాస్తి జాగరతో భయమ్* ౹౹
ఉండదు కాటకం బెపుడు
నుర్వి కృషిన్ మరి సేయుచుండగన్
నుండదు పాతకం బెపుడు
నుర్వి జపంబును సేయ భక్తితోన్
నుండదు కయ్య మెప్పుడును
నుర్విలొ మౌనముదాల్చి నుండగన్
నుండదు నెట్టియున్ భయము
నుర్విలొ నుండగ జాగరూకతన్
✍️ గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి