దసరా పండుగ - చెడు మీద మంచి సాధించిన దానికి ప్రతీక, మరియూ స్త్రీ శక్తి కి ఉదాహరణ, బద్దకం వదిలిపెట్టి లక్ష్యం దిశగా అడుగులు వేయటానికి మంచి రోజు.
మహిషాసురుడు అనే అత్యంత బలమైన రాక్షసుడు ప్రపంచం లోని అన్ని లోకాలని జయించాలని బ్రహ్మదేవుడి కోసం ఎండా వానా, ఆకలి దప్పికలని లెక్క చేయకుండా యేండ్ల తరబడి కఠోర తపస్సు చేసి తనకి ఈ ప్రపంచంలోని ఏ పురుషుని చేత మరణం లేకుండా ఉండాలని వరం పొందుతాడు, ఆడవాళ్ళు తనని ఏమీ చేయలేరని అతని నమ్మకం.
మహిషాసురుడు భూలోకం మీద, స్వర్గ లోకం మీద దండయాత్ర చేస్తూ అల్లకల్లోలం స్రుష్టిస్తూ ఉంటాడు. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణు మూర్తి కూడా అతన్ని ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు శక్తివంతమైన దుర్గాదేవి(అమ్మవారు) ని స్రుష్టిస్తారు. లక్షల రాక్షస సైన్యం తో వచ్చిన మహిషాషురుడితో దుర్గాదేవి 9 రోజులు యుద్ధం చేసి 10 వ రోజున మహిషాసురుడ్ని అంతం చేస్తుంది. అదే విజయ దశమి (దసరా పండుగ) గా జరుపుకుంటారు.
మరియూ రాముడు రావణాసురుడ్ని సంహరించినదీ ఇదే రోజు. ఇంకా పాండవులు వనవాసం పూర్తి చేసుకొని జమ్మి చెట్టు మీద ఉన్న తమ ఆయుధాలని తీసుకొని వాటికి పదును పెట్టుకొని పూజ చేపించిన రోజూ ఇదే.
తాత్పర్యం: ఆడవాళ్ళని ఇసుమంత కూడా ఏ విషయం లో తక్కువ చేసి చూడకూడదు, కొన్ని సార్లు ఈ ప్రపంచం లో ఎవరూ చేయలేని పని ని కూడా వాళ్ళు చేయగలరు మరియూ ఈ ప్రపంచాన్ని రక్షించగలరు. చెడు మీద మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. బద్దకం వదిలి ఈ రోజు నుంచి అయినా వాకింగ్ చేయటం, బుద్ది కి పదును పెట్టటం చేయాలి. పాండవులు అంతటి వారే తమ ఆయుధాలని మళ్ళీ పదును కొట్టున్నారు. గతం గతః, లే నిలబడు, బద్దకం వదిలి పెట్టు, నీ లక్ష్యం సాధించటానికి ఈ రోజు నుంచి ప్రయత్నించు అని విజయ దశమి ఈ ప్రపంచానికి చెప్తుంది.
- పెద్దలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి