💐 *శుభోదయం* 💐
*మహాభారత కథ ప్రకారం ధృతరాష్ట్రుడు అంధుడు..*
*అతనికి పుత్ర వ్యామోహం ఎక్కువ..*
*ఈ కథలో ఒక అంతరార్థం ఉంది.*
*ధృతరాష్ట్రుడు జీవుడికి సంకేతం...*
*రాష్ట్రము అంటే శరీరము...ఉపాధి..*
*ధృత అంటే దృఢం..*
*ఈ శరీరమే "నేను" అని దృఢంగా నమ్మేవాడు,*
*ధృతరాష్ట్రుడు...*
*ఇతడు అహంకారి...*
*అహంకారంతో ఉన్నవాడు ఎప్పుడూ అంధకారంలో ఉంటాడు.*
*అహంకారంతో ఉన్నవాడికి బాహ్యంగా కళ్లున్నా, జ్ఞాన చక్షువు పనిచేయదు..*
*అందుచేత జీవుడు అంధుడు...గుడ్డివాడు.*
*అహంకారంతో ఉన్నవాడు మమకారంతో జీవిస్తాడు..*
*ఈ మమకారమే వ్యామోహం...*
*నాది అనే వ్యామోహంతో ఎన్నో తప్పులు చేస్తాడు..*
*చివరకు అన్నీ పోగొట్టుకుని అహం వదలక తప్పదని వ్యాసులవారు
పాత్ర ద్వారా మనందరికీ చేసిన బోధ...*
*అర్థం చేసుకుని ఆచరిద్దాం...*
🙏🙏🙏🙏🙏
*ఓం శ్రీ గురుభ్యోనమః*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి