26, జనవరి 2026, సోమవారం

సీతారామ కల్యాణము

  సీతారామ కల్యాణము


జానక్యాః కమలామలాంజలీ పుటే 

        యాః పద్మరాగాయితాః

న్యస్తా రాఘవ మస్తకే చ

       విలసత్కున్ద ప్రసూనాయితాః 

స్రస్తా శ్శ్యామలకాయకాన్తి కలితా 

       యా ఇంద్రనీలాయితాః 

 ముక్తా స్తా శ్శుభదా భవన్తు 

       భవతాం శ్రీరామవైవాహికాః


శ్రీరామచంద్రుడు సీతామహాసతిన్

            బరిణయం బాడెడి భవ్యవేళ

 కాంతులీనెడి సీత కమలాంజలి పుటిని 

          బద్మరాగము భాతి పరిఢవిల్లి

మహానీయు రాముని మస్తకంబున నుండ 

          కుంద విరుల భంగి నందగించి

నీలమేఘచ్ఛాయ నెగడు శ్రీరాముని

         తనువుపై జారెడి తరుణమందు 

నింద్రనీలపుకాంతుల నినుమడించి

మోదమును గూర్చు చుండెడి ముక్తసేస

మిగుల శోభను వర్తిల్లి మించి సొగసు

ననయ శుభముల నిడుగాక నందఱికిని


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: