11, జులై 2024, గురువారం

హోమ్ వర్క్

 👌🤣🥴👌🥴🤣👌🥴🤣

ఒక టీచర్ తన 9వ తరగతి విద్యార్థులకు *"దొంగలపై వ్యాసం"* రాయమని హోమ్ వర్క్ ఇచ్చింది.

అందులో ఒక మేధావి వ్రాసిన వ్యాసం చదవండి. మొదట నవ్వొచ్చినా చివరకు ఇదే నిజమని మీరే మెచ్చుకుంటారు...

*ఆ మేధావి వ్రాసిన వ్యాసం చదవండి...*

దొంగలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి వారు, అది ఎలాగంటే...

* కేవలం దొంగల వల్ల మాత్రమే తాళాలు, బీరువాలు, కప్ బోర్డులు, లాకర్లు తయారుచేసేవారికి పని దొరుకుతుంది.

* ఇంటికి గ్రిల్లులు, కిటికీలు, వాకిళ్ళు తయారుచేసే వారికి కూడా పని దొరుకుతుంది.

* కాంపౌండ్ వాల్స్, గేట్స్ లాంటివి కేవలం దొంగల కొరకే కట్టడం జరుగుతుంది. 

* వాచ్మాన్స్, పోలీసుకు ఉద్యోగాలు వస్తాయి.

* CC టీవీలు, మెటల్ డిటెక్టర్లు తయారుచేసే కంపెనీలు కోట్లు సంపాదించగలుగుతున్నాయి.

* గన్స్, బుల్లెట్స్ అమ్మికూడా సంపాదిస్తున్నారు. పోలీస్ స్టేషన్లు, కోర్టులు కట్టేవారికి ఉపాధి లభిస్తుంది.

* కోర్టు ఉద్యోగులు, జడ్జులు, లాయర్లకు ఉపాధి దొరుకుతోంది.

* ఒక దొంగ ఫెమస్ అయితే వాడి గురించి ప్రతిరోజు చూపించీ, చూపించీ టీవీ ఛానల్ల వారు తమ TRP రేటింగ్స్ పెంచుకుంటారు.

* మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు, సైకిళ్ళు, కార్లు, బైకులు కొట్టేసి అమ్మడం వల్ల కూడా ఒక సెకండ్ హ్యాండ్ మార్కెట్ సృష్టించబడుతుంది.

* కాబట్టి దొంగలు ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఎంతగానో తోడ్పడతారు.

ఈ వ్యాసం చదివిన టీచర్ ఎన్ని మార్కులు వేయాలో దయచేసి మీరే చెప్పాలి. 🤝🥴🥴🥴

కామెంట్‌లు లేవు: