11, జులై 2024, గురువారం

తెలుగుని పరీక్షిద్దాం!

 ఛలో! పదండి. మీ తెలుగుని పరీక్షిద్దాం! 


క్రింది ఖాళీలను మూడక్షరాల పదాలతో పూరించండి. *ప్రతి పదము "టి" తో పూర్తవ్వాలి.*


1.ఏనుగును నియంత్రించేవాడు——.

2.చలినుండి కాపాడే వస్త్రం——.

3.పాండవులలో ఒకరినిఇలా కూడా పిలుస్తారు——.

4.రాగి,జొన్నలతో చేసే ఒక వంటకం——.

5.కాళహస్తీశ్వర శతకాన్ని వ్రాసిన కవి——.

6.పాతకాలం నటులు శివరాం ఇలా ప్రసిద్ధులు——.

7.పూర్వకాలం చలికాలం వెచ్చదనం కోసం దీన్ని వాడేవారు——.

8.ఈనిద్ర పనికి రాదంటారు——.

9.మోసగాడు——.

10.నేటి బాలలే——పౌరులు.

11.కనుబొమల మధ్యభాగాన్ని ఇలా అంటారు——.

12.పురాణాలను కొందరు ఇలా కూడాఅంటారు——.

13. కస్తూరి రంగ రంగా  మాయన్న ——రంగ రంగా, 

14.అంకెల్లో ప్రథమం——.

15.వెలుపటికి వ్యతిరేకం——.

16.వైశ్యులను ఇలా కూడా పిలుస్తారు——.

17.తిమిరం అంటే——.

18.——బ్రతుకు నాటకము అన్నాడొక కవి——.

19.సంవత్సరం పొడువునా దొరికే పండు——.

20.ఇంత మంది దేవతలుంటారని ప్రతీతి——.

21.వాక్పటిమను ఇలా కూడా అంటారు——.


కర్టెసీ: యన్. ప్రభాకర్, కర్నూలు గారు

కామెంట్‌లు లేవు: