శరీరము నందు ఏర్పడు కొవ్వు గురించి విశేషాలు -
* శరీరములో అంతర్గత రసాయన చర్యల వలన ఉత్పత్తికాని Linoleic Acid కొవ్వులో ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం .
* నరాలవ్యవస్థ సజావుగా పనిచేయుటకు కొవ్వు చాలా అవసరం .
* కొవ్వు శరీరంలో కొన్ని ప్రత్యేక కణాలలో నిలువ ఉంటుంది. ఈ ప్రత్యేక కణాలు చర్మం అడుగున మెత్తలు ( Pads of tissue ) గా ఏర్పడటమే కాక కీళ్లు మరికొన్ని అవయవాలని కుదుపుల నుంచి కాపాడుతూ వాటికి ఇన్సులేషన్ గా ఉపయోగపడును.
* కొవ్వు వేడి నుంచి మరియు చలి నుంచి మనల్ని కాపాడును. శరీరంలో నిలువ అయ్యి ఉన్న కొవ్వు కేంద్రీకృత శక్తి కింద ఏర్పడి అవసరమైన సందర్భాలలో శరీరానికి ఇంధనంగా ఉపయోగపడును .
* శరీరపు కొవ్వు కండరాల సంకోచ వ్యాకోచాలకు సహాయపడును.
* ఆరోగ్యవంతుడు అయిన పురుషుడిలో సుమారు 15 కిలోల కొవ్వు నిలువ ఉండును. ఈ కొవ్వు సుమారు రెండు నెలలపాటు అతడి ప్రాణాన్ని నిలబెట్టును . బాగా భారీకాయులు అయిన మనుషులలో 100 కిలోల దాకా నిలువ కొవ్వు ఉండును. ఇది ఒక సంవత్సరం పాటు అతని ప్రాణాన్ని నిలబెట్టును .
* స్త్రీ లలో కొవ్వు పిరుదుల వద్ద , తొడల వద్ద ఎక్కువ నిలువ ఉండును. అది వాళ్లకు గర్భధారణ కోసము , స్తన్యమును ఇవ్వటం కొరకు ఇంధనముగా ఉపయోగపడును.
పురుషులలో కొవ్వు పొట్ట భాగాన ఎక్కువ నిలువ ఉండును. అది పురుషులకు అతి త్వరగా శక్తిని ఇచ్చుటకు ఇంధనంగా ఉపయోగపడును.
* కొవ్వులోని యాసిడ్ శరీరకణాల గోడల తయారీకి సహకరించును.ఆంగ్లము నందు Cell walls అంటారు.
* శరీరం ఎదుగుదలకు సహకరించును.
* చర్మపోషణం కొరకు మరియు సెక్స్ పరమైన పునరుత్పత్తికి ఉపకరించును.
* కొవ్వులో మిళితమయ్యే A , D , E , K విటమిన్లు జీర్ణకోశము నుంచి రక్తములో ప్రవేశించడానికి కొవ్వు ఉపకరిస్తుంది.
* ఒక గ్రాము కొవ్వు ద్వారా 9 కేలరీల శక్తి లభ్యం అగును. ఇది కార్బోహైడ్రేట్స్ అందించే శక్తికి రెట్టింపు .
* కొవ్వు శరీరం యొక్క ఉష్ణోగ్రత క్రమబద్ధీకరిస్తుంది
* కొవ్వులో రెండు రకాలు ఉన్నాయి.
* శాచురేటేడ్ ఫాట్
* అన్ శాచురేటెడ్ ఫాట్ .
* శాచురేటెడ్ ఫాట్ సాధారణముగా రూము ఉష్ణోగ్రత వద్ద గడ్డకట్టిపోతుంది . ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ జంతుసంబంధ ఆహారంలో ఉంటాయి. మాంసం , చికెన్ , పాలు , వెన్న , గుడ్లు మొదలైన వాటిలో కొబ్బరినూనె , పామాయిల్ వంటి వృక్ష సంబంధ ఆహారంలో కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి.
* అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టకుండా ద్రవస్థితిలోనే ఉంటుంది. ఇది ఎక్కువుగా వృక్షసంబంధ ఆహారంలో లభించును. వేరుశెనగ నూనె , నువ్వులనూనె , ఆలివ్ ఆయిల్ , సన్ ఫ్లవర్ ఆయిల్ , సోయాబిన్ ఆయిల్ మొదలయిన వాటిలో ఉండును.
* మనం తిన్న ఆహారంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటే వాటిని కాలేయం కొలెస్ట్రాల్ కింద మార్చును .
* ఆహారంలో మీరెంత శాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే అంత ఎక్కువుగా మీ రక్తములో కొలెస్ట్రాల్ శాతం పెరిగి గుండెకి రక్తాన్ని తీసుకొనివెళ్లే కరొనరీ ధమనుల లోపలి గోడల మీద నిలువ అవుతాయి. అప్పుడు ధమని ఇరుకుగా అయ్యి గుండెజబ్బులకు , గుండెపోటుకు దారి తీయును .
* కొలెస్ట్రాల్ అనేది మన శరీరపు టిష్యూస్ మధ్య ఏర్పడే మైనంలా తెల్లగా ఉండే కొవ్వులాంటి పదార్థం .
* శరీరంలో కొలెస్ట్రాల్ అవసరం ఎంతో ఉంటుంది . కొలెస్ట్రాల్ అడ్రెనాల్ గ్రంధులలోను , పురుషుల వృషణాలలోను , స్త్రీల అండాశయాలలోను నిలువ అయ్యి "steroid harmons " కింద మార్పు చెందటానికి ఉపకరించును.
* కొలెస్ట్రాల్ పిత్తరసం ( bile ) తయారీకి ఉపయోగపడును. ఆహారం జీర్ణం అవ్వడానికి ముఖ్యముగా ఆహారంలో కొవ్వు పదార్ధాలు జీర్ణం అవ్వడానికి పిత్తరసం ( Bile ) అవసరం ఉండును.
* కొవ్వు నరాల చుట్టూ ఇన్సులేషన్ లా ఉపయోగపడటమే కాకుండా శరీరపు మిగతా అవసరాలకు ఉపయోగపడును.
* 30 సంవత్సరాల లోపు మనిషిలో కోలెస్ట్రాల్
150 m/g dl లోపల ఉండాలి .
* 30 సంవత్సరాల పైన ఉన్న మనిషిలో కొలెస్ట్రాల్
180 m/g dl లోపల ఉండవలెను .
* ఏ వ్యక్తిలో నైనా కోలెస్ట్రాల్ 200 m/g dl మించి ఉండరాదు
*
సమాప్తం
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి