*ఆచార్య సద్భావన*
➖➖➖✍️
*ప్రతీ దానికీ ఒక కిటుకు ఉంటుంది. అలాగే అంతటా ఉన్న ఈశ్వరుడిని చూడటానికి కూడా ఒక కిటుకు ఉంది. ఆ కిటుకును తెలుసుకుంటే మీకు ప్రతీ క్షణం దైవ దర్శనం అవుతూనే ఉంటుంది.*
*మీరు ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఎక్కడ నడుస్తున్నా, ఏమి మాట్లాడు తున్నా, కళ్ళు మూస్తున్నా, తెరుస్తున్నా, ఆఖరికి శ్వాసను పీలుస్తూ ఉన్న సమయంలో కూడా మీకు ఈశ్వర దర్శనం అవుతూనే ఉంటుంది.. ఆ కిటుకు చిన్నదే, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే చాలా కష్టం.*
*అది ఏమిటంటే మన ఆలోచనా ధోరణిలో ఒక మార్పు రావాలి. ఏ మార్పు అంటే నాకోసం అనే భావన పోయి ఈశ్వరుడి కోసం అనే భావన రావడం. ఈ పనిని నేను నాకోసం చేస్తున్నాను అనే స్వార్థ భావన పోయి, ఈశ్వరుడి కోసం చేస్తున్నాను అనే భక్తి భావన రావడం. ఇదే కిటుకు. మనలో ఈశ్వర భావన ఉంటేనే మంచి పనులు చేయగలుగు తాము.*
*స్వార్థ భావన వల్ల మనిషికి ఆశ ఎక్కువైపోతుంది. ఆశ ఎక్కువగా ఉండడం వల్ల మనిషి చెడు పనులు చేస్తాడు. ఈశ్వర భావన మనిషిని ఈశ్వరుడికి దగ్గర చేస్తే, స్వార్థ భావన మనిషిని ఈశ్వరుడికి దూరం చేస్తుంది..✍️*
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 944065 2774.
లింక్ పంపుతాము.
దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి