8, నవంబర్ 2020, ఆదివారం

ధార్మికగీత - 74*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                           *ధార్మికగీత - 74*

                                     *****

        *శ్లో:- భోజనాత్ పూర్వభాగే చ ౹*

               *భోజనాత్ పరత స్తథా ౹*

               *క్షణే క్షణే మతి ర్భిన్నా ౹*

               *ధర్మస్య త్వరితా గతిః ౹౹*

                                      *****

*భా:- "చంచలం హి మనః కృష్ణ !" అని పదే పదే అంటాడు శ్రీ కృష్ణ పరమాత్మ. నిరంతర మథన శీలత గలది మనసు. మనిషిని స్థిరంగా ఉండ నీయదు. పైగా బొమ్మలాట ఆడిస్తుంటుంది. భోజనానికి కూర్చునే ముందు ధర్మపరముగా అది చేయాలి, ఇది చేయాలి అని మన మనసు తహతహ లాడుతుంది. బాగా ఉత్సాహంతో ఉవ్విళ్లూరుతుంది. భోజనం చేయడం పూర్తికాగానే అలా చేస్తే లాభమా! ఇలా చేస్తే లాభమా! మరోలా చేస్తే లాభాలాభాలు ఎలా ఉంటాయి? అనే మీమాంసతో అంతర్మథనం చేస్తుంది. మన మొక్కరం చేయనంత మాత్రాన నష్టమేమీ లేదు అని నిర్ణయిస్తుంది. ఈ విధంగా క్షణ క్షణానికి చిత్రాతి చిత్రంగా ఆలోచన మారుస్తూ, చివరికి కించిత్తు దానము కాని, ధర్మము కాని చేయనీయదు. మన మానసిక పరిస్థితి ఇలా ఉంటుందని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనసు ధర్మం చేయాలని సంకల్పించగానే ఇక బుద్ధిని ఆశ్రయించాలి. వెంటనే ఇక "ఆలస్యం అమృతం విషం" అనే స్ఫూర్తితో, దాన ధర్మాలు త్వరగా చేయాలి.ఒక చేతితో చేసింది మరో చేతికి తెలియకూడదు. నీ వెంట నీవు నమ్ముకున్నవారెవరూ తోడు రారని గ్రహించాలి. దానధర్మాలే పుణ్యరూపంలో నిన్ను అనుసరించి, అడుగడుగునా రక్షిస్తాయని సారాంశము. "ధర్మో రక్షతి రక్షతః" అనే పెద్దలమాట చద్దిమూట అని గుర్తించి వర్తించాలి*.

                                    *****

                    *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: