ఒకే ఒక్క విషయం గుర్తు పెట్టుకో.. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఎలాంటి సందేహాలు లేకుండా నిర్మొహమాటంగా చేసేయ్! చుట్టూ ఉండే మనుషుల మొహాలు వైపు అస్సలు చూడకు.. అసహ్యపు ఎక్స్ప్రెషన్స్ పెట్టుకొని నిన్ను వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు. నీ లైఫ్ నీది.. నీ కష్టం నీది, ఎవడో నిన్ను ఒప్పుకునేది ఏంటి? ఎవడో నిన్ను జడ్జ్ చేసేదేంటి? ఒకే ఒక్క చూపు చూడు.. అది మొహం మీద లాగి కొట్టినట్లుండాలి. రెండోసారి నీ లైఫ్ గురించి, నీ నిర్ణయాల గురించి మాట్లాడటానికి నోరు పెగలకూడదు.
ఇక్కడ ఎవడి లైఫ్‌లో వాడు వందల చిల్లులు పెట్టుక్కుని, మళ్లీ ఆదర్శమూర్తుల్లా "అది చేయొద్దు, ఇది చేయొచ్చు, అది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు" అంటూ వెధవ పోజులు కొడతారు. "అన్నా నేను ఈ పని చేస్తున్నాను, ఇది కరెక్టేనా" అని ఇంకొకడిని అడిగావే అనుకో.. అతి కొద్దిమంది మాత్రమే భుజం తట్టి ప్రోత్సహిస్తారు. 99 శాతం మంది "అదీ.. పెద్ద వర్కౌవుట్ అవ్వదనిపిస్తోంది" అంటూ వంద వంకలు చెబుతారు.
ఈ జనాభా అంతా మేడిపండులా లోపల్లోపల కుళ్లిపోయారు. పైకి మాత్రమే తెల్లటి ఖద్దరు షర్ట్‌లు, బ్లేజర్లు, గుభాళించి కొట్టే పెర్‌ఫ్యూమ్‌లూ! మైండ్ రీడ్ చేస్తే కంపు కొడుతుంది. సో ఇక్కడ ఎవడూ లేడనుకుని దీక్షగా నీ పని నువ్వు చేసుకో.. కచ్చితంగా విజయం సాధిస్తావు. అప్పుడు ఎగబడి నీ దగ్గరకు వచ్చి రాసుకు పూసుకు తిరుగుతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి