8, నవంబర్ 2020, ఆదివారం

ఇతరులెవ్వరు

 ఇతరులెవ్వరు (మహమ్మదీయులు) సాహెబ్ బాబాను దేవునిగా హిందువులపైన రుద్దలేదు. కొందరు హిందువులు పనిగట్టుకొని అతన్ని దేవునిగా ప్రమోట్ చేశారు. అట్లని ఆయన ఎప్పుడూ తాను దేవున్నని చెప్పుకోలేదు.హిందువులకు తమ దేవీ దేవతలపైన నమ్మకం విశ్వాసం లేదు కనుక హిందువులు మాత్రమే ఈ దేశంలో సెక్యూలర్లు కనుక సాహెబ్ బాబాను ఏమిటి ఖర్మ క్రీస్తును అల్లాను మాత్రమే కాకుండా ఇంకా ఎవరైనా కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తే బరితెగించి వాళ్ళను కూడా దేవుళ్ళ జాబితాలో చేరుస్తారు. బహుశా తమ పాత దేవుళ్లను మరిచిపోయి ఉంటారు. అందువలన బలహీన మనస్కులైన హిందువులను ఎవరైనా సులభంగా బుట్టలో పడేస్తారు. హిందువులకు బలహీనతలు ఎక్కువ తమ ధర్మాన్ని గురించి వాళ్లకెవరు భోదిస్తున్నారు గనుక. పాపమంతా హిందూ స్వామిజీలు, సన్యాసులు, పురోహితులు, అర్చకులు వీరిది సామాన్య హిందువులది మాత్రం ముమ్మాటికి కానేరదు. ఆదిశగా హిందువులను చైతన్య పరచడం చేయకుండా మొసలి కన్నీరు కార్చి ఎంత చింతించి వగచినా ఏమి ఫలము ?

కామెంట్‌లు లేవు: