8, నవంబర్ 2020, ఆదివారం

శివామృతలహరి


శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన

 #శివామృతలహరి శతకంలోని మరొక పద్య రత్నం;


మ||

దయగుల్కన్ వికచాబ్జనేత్రయుగళిన్ - దైవారుదంతద్యుతుల్

నయమందస్మిత వక్త్ర భాగమున వెల్గన్-బాలచంద్రుండు ని

ర్భయతన్ తామ్రజటాకిరీటమణియై భ్రాజిల్ల సాక్షాత్కరిం

చియె - మధ్ఘోర రుజార్తిఁ బాపితి వహో ! శ్రీ సిద్దలింగేశ్వరా!


భావం;

వికసించిన తామర పూలవంటి నీ నేత్ర ద్వయంలో దయారసము తొణికిసలాడుతుండగా,చిరునవ్వు ముఖముపై ప్రకాశిస్తుండగా,రాగి రంగులో కిరీటంలా శోభిల్లుతున్న నీ జటా కిరీటంలో ఒక మణి లాగా బాల చంద్రుడు వెలుగుతుండగా నాకు సాక్షాత్కరించి తీవ్రమైన నా అనారోగ్యాన్ని తొలగించావు గదయ్యా! ఓ దయామయా! శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!


పద్య పఠనం;

సుబ్బు శివకుమార్ చిల్లర

కామెంట్‌లు లేవు: