మహిళామణిహారతి అను సీతారామకల్యాణం(ఖండిక)
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
గీ; అష్ట లక్ష్మీస్వరూపాల పుష్టిగొల్పి
సృష్టి నంతటి కాపాడు శిష్ట రక్ష
దీవ్య శక్తి ప్రభా భాసితావ్యయకృప
అవని సీతయైమిథిలకే అందమిడియె.
సీ. ఊయలన్ బవళించి ఊగాడు నాళ్ళనే
పరవసింపగ నవ్వి పలకరించి,
బుడిబుడి నడకల నడిచెడి నాళ్ళనే
మిథిల మోదమునింపి వ్యథలతీర్చి,
చెలులతో నాటాడు స్నిగ్ధంపు నాళ్ళనే
సహకారమును చాటి జాలిచూపి,
కనులకింపుగమారు కన్యయౌ నాళ్ళనే
రతిని క్రిందొనరించి రక్తిపెంచి ౼
నట్టి, యౌవనారంభ, విద్యా ధనాఢ్య
స్వ స్వయంవర సత్సభా భాస యగుచు
రామణీయకుడగు నాథు, రామ, సీత
ఎన్నుకొను వేడ్క, గనరారె, యింతులార!
రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి