8, నవంబర్ 2020, ఆదివారం

దీపావళి విశేషాలు -2 🪔

 🪔దీపావళి విశేషాలు -2 🪔


సకల శుభావళి

దీపావళి

        🚩🔔🚩


భాద్రపదమాసంలో చవితి నాడు వినాయకునితో ఆరంభించి ఒక్కొక్క దేవీ దేవతకు  సంవత్సరం అంతా పండుగలు జరుపుకుంటాము.


కాని, ఒకే పండుగలో  సకల దేవతలను పూజించిన పుణ్యఫలాలు

లభిస్తున్నాయంటే  అది

మరింత విశిష్టమైన పండగ కదా  ?

అలాటి ప్రత్యేకత సంతరించుకున్న పండుగే దీపావళి. 


ఆశ్చర్యంగా వున్నదా ? 


దీపావళిరోజున  పండుగగా జరుపుకోవడం

సకల దేవతలను  ఆరాధించినట్లు , ఎలా అవుతోందో  తెలుసుకుందాము. 


ఆరోజున మొదటగా పవిత్ర గంగా స్నానం చెయ్యాలి. గంగలో స్నానం చేయడమంటే , పాపాలన్నీ తలగించి

పుణ్యాన్ని కలిగించేదని

పురాణాలు తెలుపుతున్నాయి. కాని

గంగానదిలో స్నానం చేయడం అందరికీ సాధ్యం కాని పని. 

అందరికి ఆ మహాధ్భాగ్యం ప్రసాదించాడానికి గంగాదేవి  దీపావళి నాడు  సకల జలాలలోను ప్రవేశిస్తుంది.


ఆనాడు ప్రాతఃకాలంలోనే నిద్ర

లేచి  దేహమంతటికి నూనె పట్టించుకొని తలారా స్నానం చేస్తే , మహాలక్ష్మీ

కటాక్షం, గంగాదేవి  ఆశీర్వాదాలు  ఒక్కటిగా

ఒకేసారి లభిస్తాయి. 


నరకాసురుడు  తాను చనిపోయిన రోజున, తనని తలచుకొని స్నానం చేసిన వారికి , గంగలో స్నానం చేసిన పుణ్యం లభించాలని  వరాన్ని పొందాడు.   


అలాగే , మహాలక్ష్మీ అనుగ్రహం కలగడానికి

ఒక పురాణకధ వున్నది. దీపావళీ పండగ దినాన మహాలక్ష్మీదేవి  నువ్వుల నూనెలో నివసిస్తుందట. అమృతం కోసం

పాలకడలిని చిలికినప్పడు , పాలకడలి నుండి శ్రీమహాలక్ష్మీ ఉద్భవించినది.  ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసి వ్యామోహం చెందిన దానవులు ఆమెను వెంటాడి రాగా , లక్ష్మీదేవి  దట్టమైన నువ్వులమొక్కల వనం గుండా పరువులెత్తి శ్రీ మహావిష్ణువు ని చేరుకున్నదిట.  సముద్రరాజ పుత్రికను వెంటాడుతున్న దుష్ట దానవులను  అడ్డుకునేందుకు నువ్వుల చెట్లు తమలోని నూనెను ధారగా చెమరించాయి.  ఆ నూనెలో పరిగెత్తలేక దానవులు జారిపడి అవస్థలు పడుతున్న సమయంలో లక్ష్మీదేవి  వేగంగా శ్రీ మహావిష్ణువు ని చేరుకున్నది. 

ఈ సంభవం జరిగినది ఒక తులా మాస  చతుర్దశి రోజు.  తనకు సహాయం చేసి కాపాడినందుకు కృతజ్ఞతగా తాను

ఆనాడు నువ్వులనూనెలో

నివసించి ప్రజలకు శుభాలు కటాక్షిస్తానని మహాలక్ష్మి మాట యిచ్చినది .

తులా మాస కృష్ణ పక్ష 

చతుర్దశినాడే  దీపావళి.

అమవాస్య తిధి కొన్ని సమయాల్లో వచ్చినా 

చతుర్దశి వున్న సమయమే

నరక చతుర్దశి గా , దీపావళిగా ఉత్సవాలు జరుగుతున్నవి. 

అంతేకాదు, ఆనాడు కుంకుళ్ళలో ,సీకాయ్ పొడిలో సరస్వతీదేవి, కుంకుమలో

పార్వతీదేవి , చందనం లో భూదేవి  ఆవాహనమైవుంటారని ఐహీకం. గంగాస్నానం చేసి  నుదుట కుంకుమ, చందనం పెట్టుకోవడంతో 

ముగ్గురు దేవిలతో పాటు భూదేవి  అనుగ్రహం పొందడమౌతుంది.


 🪔దీపావళి నాడునూతన వస్త్రధారణ చేస్తే (ఆనాడు  కొత్త వస్త్రాలు కొనుక్కోలేని వారు ఉన్నంతలో

శుభ్రమైన వస్త్రాలు ధరిస్తే కూడా చాలు) 

శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది అని తెలియచేస్తోంది

దీపావళి మహాత్యం. 

అలంకార ప్రియుడైన 

మహావిష్ణువు కి నూతన

వస్త్రాలు ప్రీతి కదా..

నూతన వస్త్రాలు ధరించడం ద్వారా

మహావిష్ణువు కటాక్షం కూడా పొందేము. 

 

🪔సాధారణంగా  క్రొత్త దుస్తులు ధరించగానే, పెద్దవారి ఆశీర్వాదాలు, తల్లి తండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంటాము. అటువంటి అలవాటు లేని వారు కూడా దీపావళి నాడు ఆరంభించండి .

ఎందుకంటే ఆనాడు  ఆలా ఆశీర్వాదాలు తీసుకున్న వారిని  హరి..హరులు ఇద్దరి సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వాదాలు లభిస్తాయని శాస్త్రం వివరించింది. 

పెద్దవారి ఆశీర్వాదం నారాయణుని ఆశీర్వాదమని,  తల్లి తండ్రుల ఆశీర్వాదం

పరమేశ్వరుడే ఆశీర్వదించినట్లని 

అంటారు.


🪔తరువాత,తమ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని పూజించాలి.

వంశావళిని కాపాడేది ఆ

దేవతలే. 


🪔పిదప  ప్రసాదం,  తీపితోనే ఆరంభం.  ఏదైనా ఒక 

తీపి వస్తువుగాని, ఒక  చిటికెడు

చక్కెరగాని మనకి వీలైనది నోట్లోవేసుకోవాలి. అలాగే మన పెద్దవారి చేతుల మీదుగా ఆ తీపిని తీసుకుని

తినాలి. ఎందువలన అనగా దీపావళి రోజున  తీపిగాని ,ఇతర ఫలహారాలు, ఏది తిన్నా అందులో అమృతం కలసి

వుంటుంది అని భవిష్యత్

పురాణం , పద్మ పురాణం తెలుపుతున్నవి. 


🪔ఆ తరువాత బాణసంచా కాల్చాలి. కాంతి ..శబ్దం   రెండూ పరస్పరం అంటిపెట్టుకునే వుంటాయి. 

హరి హరులు ఒకరే అని మీరు గ్రహించే వుంటారు.

ఆ తత్వాన్ని వివరించేది

కాంతి..శబ్దాలతో కూడిన టపాకాయలు,మతాబులు మొదలైనవి. నందీశ్వరుని మద్దెలగా మ్రోగే పేలుడు టపాకాయలు, గరుత్మంతుని రెక్కల కదలిక కు వెలువడే ప్రకాశం వలె ప్రకాశించే  మతాబులు అన్నీ దైవాంశాలకి సంబంధించినవే.


🪔కాని బాణసంచా కాల్చేప్పుడు అగ్ని ప్రమాదాల విషయంలో జాగ్రత్తవహించి టపాకాయలను

కాల్చి ఆనందించండి.


🪔దీపావళి నాడు ఎన్ని రకాల

ఫలహారాలు తిన్నా  ఒక  లేహ్యపువుండ అని చెప్పబడే  ఔషధ వుండను తినడం   అత్యవసరం

అని అంటారు .

పాలకడలి చిలికినప్పుడు 

అమృతకలశం తో ఉధ్భవించినవాడు ధన్వంతరీ.  మహావిష్ణువు

అంశ అయిన ధన్వంతరీ 

యే ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేవాడు. 

దీపావళీ లేహ్యంలో ధన్వంతరీ అంశ కలిగినందున, లేహ్యం తినడం మంచిదని ఐహీకం.


🪔గంగా స్నానం నుండి దీపావళి లేహ్యం దాకా 

అన్ని ఐహీకముల వలన

కామెంట్‌లు లేవు: