8, నవంబర్ 2020, ఆదివారం

శ్రీమద్భాగవతము


*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1950 (౧౯౫౦)*


*10.1-950-వ.*

*10.1-951-*


*మ. సురభిక్షీరములన్ సురద్విప మహాశుండా లతానీత ని*

*ర్జరగంగాంబువులన్ నిలింపజననీ సన్మౌనిసంఘంబుతో*

*సురనాథుం డభిషిక్తుఁ జేసి పలికెన్ సొంపార గోవిందుఁ డం*

*చు రణాక్రాంతవిపక్షుఁ దోయజదళాక్షున్ సాధుసంరక్షణున్!*🌺



*_భావము: ఇంద్రునితో వచ్చిన పరమ పూజ్యమగు కామధేనువు శ్రీ కృష్ణుని ఇలా స్తుతించింది: "పరమేశ్వరా! దేవదేవా! నీవే మా దైవమవు. నీవే మా ప్రభువవు. బ్రహ్మ దేవుడు బ్రాహ్మణులు, ధేనువులు, దేవతలు, సాధువులకు సుఖ శాంతులు కలగ చేయుటకు నీకు పట్టము కట్టమని మమ్ము నియమించి పంపాడు. నీవు ఈ సమస్త భూమండలము యొక్క భారమును తగ్గించటానికి అవతరించిన ఆదినారాయణుడవు”. ఆపై ఇంద్రుడు మహర్షులతో కలిసి సురభి (కామధేనువు) యొక్క క్షీరముచే, ఐరావతము యొక్క గొప్ప తొండము చేత తేబడిన పవిత్ర దేవ గంగాజలములతో, శ్రీకృష్ణునికి పట్టాభిషేకము గావించి, శత్రువులను జయించి రాజ్యములను ఆక్రమించగలవాడు, సాధుజనులను సర్వదా సంరక్షించేవాడు, పద్మదళాయతాక్షుడగు గోవిందుడు మనోహరముగా ఒప్పుచున్నాడు" అని ప్రశంసించెను._* 🙏



*_Meaning: Kamadhenu, the best and most sacred cow eulogized virtues of Sri Krishna: "O Almighty! You are our God, saviour and our ruler. Brahma ordained us to crown You, so that Brahmins, Cows, Celestial beings (devatas) and the people of virtue live in peace and happiness. You are an incarnation of Sri Maha Vishnu and You took this birth to reduce weight of sinners from this earth". Thereafter, Indra along with sages (Maharshis) performed crowning ceremony of Sri Krishna with auspicious milk from Kamadhenu and sacred Ganga Jal (water from river Ganga) brought in the trunk of Airavata (Elephant of Indra) and said "Sri Krishna, the winner of battles against demons, the conqueror of all other kings and saviour of people of virtue, is glowing in a splendid and brilliant manner"._*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*

                                                                                                                                              *భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  


*రోజుకో పద్యం: 1951 (౧౯౫౧)*


*10.1-952-*


*సీ. తుంబురు నారదాదులు సిద్ధచారణ;* 

*గంధర్వులును హరికథలు పాడి*

*రమరకాంతలు మింట నాడిరి వేల్పులు;* 

*కురియించి రంచిత కుసుమవృష్టి*

*జగములు మూఁడును సంతోషమును బొందెఁ;* 

*గుఱ్ఱుల చన్నులం గురిసెఁ బాలు*

*నవజలంబులతోడ నదులెల్లఁ బ్రవహించె;* 

*నిఖిల వృక్షములు దేనియలు బడిసె*

*తే. సర్వలతికల ఫల పుష్ప చయము లమరెఁ*

*బర్వతంబులు మణిగణప్రభల నొప్పెఁ*

*బ్రాణులకునెల్ల తమలోని పగలుమానె*

*వాసుదేవుని యభిషేక వాసరమున.* 🌺



*_భావము: వాసుదేవుని పట్టాభిషేక సమయమున తుంబురుడు, నారదుడు మొదలగు అమరగాయకులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు విష్ణు కథలను గానము చేశారు. దేవకాంతలు ఆకాశమునందు నాట్యాలు చేశారు, దేవతలు మనోజ్ఞమైన పుష్పవర్షము కురిపించారు. ముల్లోకములలోని జీవులు అమితమైన ఆనందమును పొందారు. పాడియావుల పొదుగులనుండి పాలు సమృద్ధి గా ప్రవహించాయి. ఏరులన్నీ కొత్త నీటితో పారాయి. సకల వృక్షములు మకరంద భరితమయ్యాయి. సమస్తమైన లతా నికుంజములు పండ్లు, పూలతో మనోహరముగా కనిపిస్తున్నాయి. కొండలు మణి, రత్న సమూహ కాంతులతో ఒప్పుచున్నాయి. విశ్వమండలి జీవులన్నియు తమతమ సహజ సిద్ధ వైరములు మానుకున్నాయి._* 🙏



*_Meaning: At the time of crowning Sri Krishna Tumbura, Narada and other celestial singers and Siddhas, Charanas and Gandharvas sang tales of Sri Krishna's great deeds. Celestial women danced in the sky and Devatas showered flowers. People of all three Lokas rejoiced and milk flowed from the udders of cows. Rivers and rivulets were full with fresh water, all trees were endowed with nectar and all creepers bloomed with flowers and fruits. Mountains shone with gems and pearls and all living beings shed their natural enmity towards some of their fellow lives._* 🙏

 


*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454).*

కామెంట్‌లు లేవు: