వంశపారంపర్య వేదరక్షా సభ పేరుతో ఏర్పడ్డ గ్రూపు ప్రాథమికంగా శ్రీశ్రీశ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వామి (పూర్వాశ్రమపు బ్రహ్మ శ్రీ దెందుకూరి హనుమత్ ఘనపాఠీ) గారి ఆధ్వర్యంలో వంశపారంపర్య వేద విద్యార్థుల ప్రోత్సాహక సభ కోసం (గత 8 సంవత్సరాలుగా జరుగుతోంది) ఏర్పాటు చేసాము. ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చి లలో విద్యారణ్య మరియు వేదాంత పండితుల సభ కోసం వారి ఆధ్వర్యంలో నే మరో గ్రూప్ ఏర్పాటు చేసాం. అంతేగాక మా నాన్నగారు బ్రహ్మ శ్రీ రేమెళ్ల సూర్య ప్రకాశ శాస్త్రి గారి పేర గత 30 ఏళ్ళు గా ప్రతీ కృష్ణాష్టమి మర్నాడు వేదశాస్త్ర సభ నిర్వహిస్తున్నాము. వీటి అన్నిటిలో నా భాగస్వామ్యం అనేకమంది స్నేహితులు వేదాభిమానులని ఇన్వాల్వ్ చేసి వారికి కూడా వేదాశీర్వచనం కలిగింపజేసే అదృష్టం కలిసి వచ్చింది. అంతేగాక కరోనా చేయించిన మంచి పనుల్లో నాన్న గారి 1969 విజయవాడలో చేసిన 12 రోజుల 'వేదార్థోపన్యాసములు' పుస్తక పునర్ముద్రణ లో శ్రీ శ్రీ శ్రీ హంపీవిద్యారణ్య స్వామీజీ సహకారం మరింతమందిని దగ్గర చేసింది. మా నాన్నగారి శతజయంతి కూడ ఆన్లైన్ లో చేసుకోవాల్సిరావడం 12 నెలలూ 12 సభలు జరుపుకునే అదృష్టం కల్పించి ఇంకొంతమందిని దగ్గర చేసింది. వీటన్నిటినీ దృష్టి లో పెట్టుకొని వీళ్ళందరినీ ఒకే గ్రూపులో చేర్చాలని వీటికి సంబంధించిన సమాచారం అందరికీ పంచాలనీ వారివారి అభిరుచి అవకాశాల్ని బట్టి వారికిష్టమైన కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తూ వంశపారంపర్య వేదరక్షా సభ గ్రూపులో కలుపుతున్నాను. అందరూ వారివారి అభిరుచి ని బట్టి మాత్రమే సలహాలిస్తూ విషయపరంగా కాని ఆర్థికంగాకాని మరింత మందిని ఇందులో భాగస్వాములు చేసి వేదాశీర్వచనం పొందిద్దామని కోరుకుంటున్నాను- రేమెళ్ల వేంకటేశ్వర్లుని
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి