8, నవంబర్ 2020, ఆదివారం

త్రికరణశుద్ధి

 _*🧠🗣️👐త్రికరణశుద్ధి - త్రికరణాలు*_ 

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*_1. 🧠మనసా (మన ఆలోచన, సంకల్పం)._*


*_2. 🗣️వాచా (వాక్కు ద్వారా, చెప్పినటువంటిది)._*


*_3.👐 కర్మణా (కర్మ, చేతల ద్వారా)._*



*_మనలో చాలామందికి మనస్సులో ఒక సంకల్పం ఉంటుంది. అది ఎదుటివారి మెప్పు కోసమో, లేక మన సంకల్పం బయల్పరచడం ఇష్టం లేకో, లేదా మరొక కారణం చేత అనుకున్నది చెప్పలేక, చెప్పిన పని చెయ్యలేము. మనస్సు అనుకున్న విషయం నాలుక ద్వారా చెప్పలేము, చెప్పినది ఆచరించలేము. అది ఏదో ఒక దానిని  ఆలోచించి,  మాట్లాడి,  చేసెయ్యడం కాదు. ధార్మికమైన, శాస్త్ర ఆమోదయోగ్యమైన, అందరికీ ఉపయోగపడేకర్మ ఉండాలని శాస్త్రం చెబుతుంది. అదే త్రికరణశుద్ధి._*



*_త్రికరణశుద్దిగా చేసే పనులను "దేవుడుమెచ్చును లోకము మెచ్చును” కాని తప్పుడు పనులు చేస్తే "దేవుడు క్షమించడు లోకము క్షమించదు" అని పెద్దలు ఏనాడో చెప్పారు._*



*_కొన్నిసార్లు తప్పు చేస్తున్నామని మనకు తెలిసినా ఎవరు చూడటం లేదు కదా అనుకుని పొరపాటు చేస్తుంటాం. ఎవరు చూసినా చూడక పోయినా మనలోని అంతరాత్మగా మెలిగే భగవంతునికి అన్నీ తెలుస్తాయి మన మనస్సులో విషయం మరొకరికి తెలియకపోవచ్చు కానీ మన సంకల్పాలన్నీ చదవగలిగిన దేవునికి ఇది తెలిసి ఉండదా. తప్పకుండా తెలుస్తుంది దానికి తగిన ఫలం సిద్ధం చేసి ఉంచుతాడు, మనం దానిని అనుభవించ వలసిందే తప్పదు._*



*_ఒకసారి ఓ గురువుగారు తన శిష్యుడిని పరీక్షించ తలచి మిగతా శిష్యులకు ఓ పండు ఇచ్చి ఎవ్వరికీ తెలియకుండా తినమని వారి గురువుగారు చెప్పగా, అతడు చాలా సేపు ప్రయత్నం చేసి పండుతో తిరిగి వచ్చి గురుదేవా మనుషులు లేని ప్రాంతం ఉంది కాని దేవుడు లేని ప్రదేశం కానీ, అంతరాత్మ చూడని చోటు కానీ తనకు కనబడ లేదని చెప్పగా గురువుగారు ఎంతో సంతోషించి ఆశీర్వదించారు._*



*_ఎవరి మెప్పుకోసమో కాదు కదా మనం చేసే కర్మ. అది మనకోసమే కదా. అనుకున్నది చెప్పి, చెప్పిన సత్కర్మ చెయ్యడం అభ్యాసం మీద కానీ రాదు. అన్నీ మంచి ఆలోచనలే వస్తే వాటిని ఆచరించడంలో మనం జాప్యం చెయ్యకుండా భగవంతుని ఆజ్ఞ అనుకుని ఆచరించడమే శ్రేయస్కరం._*



*_ఒక చిన్న లౌకిక ఉదాహరణ తీసుకుందాం. చిన్నప్పుడు కిడ్డీ బ్యాంకులు అని చిన్న  బొమ్మలను అందరూ చూసి ఉంటారు. ఆ బొమ్మ క్రింద భాగంలో అంకెల చట్రాలు మూడు ఉంటాయి. సరైన అంకెల కలయిక ఇవ్వనిదే ఆ మూత తెరవబడదు. పైన ఒక చిన్న రంధ్రం నుండి మనం పైసలు లోపలకు వేస్తాము. చివరన అవసరమైనప్పుడు ఆ అంకెల కలయిక సరిగ్గా ఇచ్చి దానిలో డబ్బులు తీసుకోవడానికి వీలు ఉంటుంది. మనం కూడా మన చిట్టాలో చేసుకున్నంత పుణ్యం కొద్ది కొద్దిగా వేసుకుంటూ దాచుకుంటూ ఉంటాము. దైవానుగ్రహాన్ని ఆ కిడ్డీ బ్యాంకులో దాచుకున్నట్టు మనం ప్రోది చేసుకుంటూ ఉంటాము. అటువంటి అనుగ్రహ డిబ్బీలో ఒక చట్రం మానసిక, ఒక చట్రం వాచిక, ఒక చట్రం కాయిక కర్మలు. ఎప్పుడైతే ఈమూడు సరిగ్గా సరిపోతాయో అప్పుడు పుణ్యం అనే గని తెరువబడి దైవానుగ్రహం అనే సుధాధార మనమీద వర్షిస్తుంది._*



*_మనం పాపాలు కూడా ఈ మానసిక, వాచిక, కాయిక కర్మల ద్వారా ఆచరిస్తాము. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం మానసిక పాపం, ఒకడికి చెడు కలగాలని దూషించడం వాచిక పాపం, చేతల ద్వారా చేసే పాపం కాయిక పాపం._*

 


*_ఇంతేకాదు ఆ పాపాలు శారీరక మరియు మానసిక సంఘర్షణకులోను చేసి ప్రశాంతతను ఇవ్వదు. సరికదా అపరాధభావం వెంటాడుతూ ఉంటుంది. కానీ ఇవి హాని కలిగించే పాపాలు కావున వీటిని త్యజించి మనలో ఎల్లప్పుడూ కేవలం సుకర్మలు మాత్రమే శుద్ధిగా జరిపించాలని త్రికరణశుద్ధిగా ఆ భగవంతుని వేడుకుంటూ ఉండాలి !_*



*_త్రికరణాలు శుద్ధిగా ఉన్నప్పుడు.... ఆ శుద్ధమైన పరికరమనే శరీరం కలిగిన వ్యక్తుల ద్వారా ఆ పరమాత్మ  చైతన్యమే వ్యక్తమవుతుంది!_*


🕉🌞🌎🌙🌟🚩

కామెంట్‌లు లేవు: